Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో జనసేన ఎంపీ.. ఏకంగా రూ.92 లక్షలు ఎలా కొట్టేశారంటే?

కాకినాడ జనసేన ఎంపీ, టీ-టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించి.. ఆయన కంపెనీ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update
money

Cyber ​​fraud

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సైబర్ మోసాలు అనేవి పెరిగిపోతున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి. ఇవి ఇంటర్నెట్, ఈమెయిల్, సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల ద్వారా జరుగుతాయి. మోసగాళ్లు అమాయక ప్రజలను తమ తెలివి తక్కువగా చేసి.. వారి వ్యక్తిగత సమాచారాన్ని, డబ్బును దోచుకుంటారు. ఈ మోసాలు ఫిషింగ్, మాల్వేర్, ఓటీపీ మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, లాటరీ మోసాలు వంటి అనేక రూపాల్లో జరుగుతాయి. డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండాలంటే.. ఎటువంటి అనవసర లింకులను క్లిక్ చేయవద్దు, వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు, సైబర్ నేరాల గురించి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతూనే ఉంటారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఎంపీ డబ్బులను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు.

సైబర్ నేరగాళ్లు భారీ మోసం..

కాకినాడ జనసేన ఎంపీ, టీ-టైమ్ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించి.. ఆయన కంపెనీ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీ-టైమ్ సంస్థలో చీఫ్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాస రావుకు గత నెల 22న ఒక కొత్త నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ నంబర్ ప్రొఫైల్‌లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫొటో ఉండటంతో.. అది ఆయనేనని నమ్మాడు. నేను కొత్త నంబర్ వాడుతున్నాను.. అత్యవసరం.. కొంత డబ్బు పంపించని పదే పదే మెసేజ్‌లు పంపించాడు. ఇది నిజంగా తన యజమాని అడిగినట్లు భావించిన శ్రీనివాసరావు.. ఎటువంటి క్రాస్ చెక్ చేసుకోకుండా వివిధ బ్యాంకు ఖాతాలకు 11 సార్లుగా మొత్తం రూ.92 లక్షలు బదిలీ చేశారు.

ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. బడి నుంచి రాగానే తల్లిని అలా చూసి! గుండెపగిలే ఘటన!

ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఖాతాలను తనిఖీ చేస్తుండగా కొన్ని అనుమానాస్పద లావాదేవీలు కనిపించాయి. వెంటనే ఆయన తన ఫైనాన్స్ మేనేజర్‌ను పిలిచి ప్రశ్నించగా.. తన ఫోన్ నంబర్ మారలేదని.. డబ్బుల కోసం ఎలాంటి మెసేజ్‌లు పంపలేదని ఎంపీ స్పష్టం చేశారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన మేనేజర్ వెంటనే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే మొదటి లావాదేవీ జరిగి దాదాపు రెండు వారాల తర్వాత ఫిర్యాదు చేయడంతో అప్పటికే నేరగాళ్లు డబ్బును డ్రా చేసుకున్నారు. పోలీసులు కేవలం రూ.7 లక్షలు మాత్రమే స్తంభింపజేయగలిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై నిఘా ఉంచడం, వారి బారి నుంచి రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రజలు ఇలాంటి సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

ఇది కూడా చదవండి: కర్నూలులో రాక్షస తండ్రి.. 8 ఏళ్ల చిన్నారిని నీటిలో ముంచి.. ఎంత దారుణంగా చంపాడంటే?

Advertisment
తాజా కథనాలు