TG-AP Rains: తెలంగాణ, ఏపీకి రెయిన్ అలర్ట్.. డేంజర్‌లో ఉన్న జిల్లాలివే!

అల్పపీడనం కారణంగా రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి కె. శ్రీనివాస్ తెలిపారు.

New Update
TG-AP Rains

TG-AP Rains

వానా కాలం మనసులకూ ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. కానీ భారీ వర్షాలు గత కొద్ది రోజూలుగా దేశ ప్రజలన్నీ అతలాకుతలం చేస్తున్నాయి. అయితే అత్యంత తీవ్రమైన వర్షపాతం.. అంచనాలకు మించి సాధారణ వర్షపాతం కంటే చాలా ఎక్కువగా కురుస్తుంది. భారతదేశంలో ఈ వర్షాలు తరచుగా రుతుపవనాల సమయంలో సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  భారీ వర్షాలు వల్ల నదులు, వాగులలో నీటిమట్టం పెరిగింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వరదలు సంభవించి.. ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. వ్యవసాయ పంటలకు, మౌలిక సదుపాయాలకు, పర్యావరణానికి భారీ నష్టంతోపాటు ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాక కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ విపత్కర పరిస్థితులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులను, నష్టాలను కలిగిస్తాయి. అయితే మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు ఉన్నాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

భారీ వర్షాలకు అవకాశం..

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి కె. శ్రీనివాస్ తెలిపారు. ఈ అల్పపీడనం కారణంగా రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కోస్తాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలకు గుండె పోటు.. ఎందుకో తెలుసా..?

ముఖ్యంగా రానున్న 24 గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీని దృష్ట్యా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు మత్స్యకారులు రెండు రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. అధికారులు అల్పపీడన కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారని.. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తారని శ్రీనివాస్ తెలిపారు. 

ఇది కూడా చదవండి: నడవడంలో ఈ పొరపాట్లు చేయకండి.. లేదంటే నడిచి ప్రయోజనం ఉండదు

Advertisment
తాజా కథనాలు