/rtv/media/media_files/2025/05/11/0RU7m079vwNel1a9UcFt.jpg)
RRB Railway Paramedical Job Notification 2025
పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సికింద్రాబాద్ ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 434 పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆర్‌ఆర్‌బీ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా పలు పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలిసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-2, ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి సమాచారం కోసం ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు:
నర్సింగ్ సూపరింటెండెంట్: 272 పోస్టులు
డయాలిసిస్ టెక్నీషియన్: 04 పోస్టులు
హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-2: 33 పోస్టులు
ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్): 105 పోస్టులు
రేడియోగ్రాఫర్ ఎక్స్‌రే టెక్నీషియన్: 04
ఈసీజీ టెక్నీషియన్: 04 పోస్టులు
లాబోరేటరీ టెక్నీషియన్ గ్రేడ్-2: 12 పోస్టులు
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ దరఖాస్తును సబ్మిట్ చేసే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హత ప్రమాణాలను నిర్ధారించుకోవాలి.
అర్హత:
అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో BSC నర్సింగ్, BSC, డిప్లొమా, 10+2 లేదా ఫార్మసి, రేడియోగ్రఫిలో డిప్లొమా, డిగ్రీ, DMLTలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
వయోపరిమితి:
పోస్టును బట్టి కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి గరిష్ట వయస్సు 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్, OBC, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 500
SC, ST, మైనారిటీ, EBC, పీడబ్ల్యూబీడీ, ESM, మహిళా, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ. 250
ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రైల్వే శాఖలో పారామెడికల్ విభాగంలో ఉద్యోగం పొందాలనుకునేవారికి ఇది ఒక మంచి అవకాశం. మరిన్ని వివరాలకు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
ఆన్‌లైన్ చివరితేదీ:
సెప్టెంబర్ 18, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వారీగా నెలకు జీతభత్యాలు
నర్సింగ్ సూపరింటెండెంట్: రూ.44,900
డయాలిసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్‌స్పెక్టర్ : రూ.35,400
ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ : రూ.29,200
ఈసీజీ టెక్నీషియన్ : రూ.25,500
లాబోరేటరీ అసిస్టెంట్ : రూ.21,700.