/rtv/media/media_files/2025/09/12/thopudurthy-bhaskar-reddy-2025-09-12-17-45-11.jpg)
వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్నం పొలంలో పనులు చేయిస్తూఆకస్మికంగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. భాస్కర్ రెడ్డి మృతిపట్ల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నాన్న తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేశారు. వఅనంతపురం వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. భాస్కర్ రెడ్డితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.
మా పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డిగారి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివి. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని,… pic.twitter.com/oypzFBZ9ui
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2025
తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ సీఎం జగన్ అన్నారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్ట్ చేశారు జగన్.
 Follow Us