Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ !

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, మెదక్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

New Update
Hyderabad Heavy Rains

Hyderabad Heavy Rains

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మరో మూడు రోజుల పాటు ఇలానే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణలోని మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్లు ప్రాంతాలు మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. 

ఇది కూడా చూడండి: Heavy rains: తెలంగాణ మళ్లీ వరద ముప్పు.. 4 రోజులు ఈ జిల్లాలో భారీ వర్షాలు!

హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్, హయత్  నగర్, శేరిలింగపల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, పెద్దమ్మతల్లి గుడి, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, వేవ్ రాక్, పటాన్ చెరువు, లింగంపల్లి, మెహిదీపట్నం, మణికొండ, సికింద్రాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

వచ్చే 24 గంటల్లో తెలంగానలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజమాబాద్, కామారెడ్డి, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, జనగాం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు తెలిపారు. ఇక తెలంగాణతో పాటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి: ఇదేం ట్రాఫిక్ రా బాబు.. హైటెక్ సిటీ ఏరియాలో వాహనాలు ఎలా ఆగాయో చూడండి-PHOTOS

Advertisment
తాజా కథనాలు