BIG BREAKING: పిఠాపురం వర్మకు తప్పిన పెను ప్రమాదం!-VIDEO
కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్లో ఎగసిపడుతున్న రాకాసి అలలను పరిశీలించడానికి వర్మ ఈ రోజు వెళ్లారు. ఈ క్రమంలో వర్మను భారీ కెరటం బలంగా తాకింది. అలల తాకిడితో వర్మ కిందపడబోయారు.
కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్లో ఎగసిపడుతున్న రాకాసి అలలను పరిశీలించడానికి వర్మ ఈ రోజు వెళ్లారు. ఈ క్రమంలో వర్మను భారీ కెరటం బలంగా తాకింది. అలల తాకిడితో వర్మ కిందపడబోయారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం బాలిక మిస్సింగ్ పై బందువుల ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. మైనర్ బాలికను రాడ్డుతో తండ్రి కొట్టి చంపినట్లు తెలుస్తోంది.
దేశంలో 40 ప్రాంతీయ పార్టీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఆదాయంలో 70 శాతానికి పైగా నిధులు ఎన్నికల బాండ్ల ద్వారానే వచ్చాయని నివేదిక స్పష్టం చేసింది.
ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపూర్‌లో నిర్వహిస్తున్న విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుతున్నామన్నారు.
అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సభ రాజకీయా కోసం, ఓట్ల కోసం కాదని ఆయన అన్నారు. జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని చంద్రబాబు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో కారంపొడి లోడ్‌తో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. కరంపొడితో వెళ్తున్న లారీ పైన వేసిన టార్పలిన్ పట్టా ఎగిరిపోయింది. అది గమనించని లారీ డ్రైవర్ అలాగే లారీని నడిపాడు. లారీ వెనుక ప్రయాణిస్తున్న బైకర్ల కళ్లు మొత్తం కారంతో నిండిపోయింది.
పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో... విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు పెళ్లి ముహూర్తం పెట్టించుకుని తిరిగి వస్తుండగా తల్లిదండ్రులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో చోటుచేసుకుంది.
నేపాల్‌లో జెన్ Z యువత చేపట్టిన ఆందోళలు హింసాత్మక ఘటనలకు దారితీసిన సంగతి తెలిసిందే. అక్కడ తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. దీంతో వాళ్లకు సాయం అందించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు దిగాయి.
ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశా, మహారాష్ట్రలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.