/rtv/media/media_files/2025/09/11/kurnool-crime-news-2025-09-11-15-55-04.jpg)
Kurnool Crime News
కర్నూలు జిల్లాలోని దేవనకొండలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వీరేష్ అనే వ్యక్తి తన ఎనిమిది నెలల కన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తన భార్య శ్రావణిని తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం శ్రావణి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వీరేష్ తన చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి చంపినట్లు తెలుస్తోంది.
కన్న కూతురిని చంపిన తండ్రి:
ఇది కూడా చదవండి: ప్రియుడితో దొరికిన భార్య....అర్థనగ్నంగా ఊరేగించిన భర్త..ట్విస్ట్ ఏంటంటే?
వీరేష్ గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు సమాచారం. తన మొదటి భార్యను కూడా చంపి జైలుకు వెళ్లి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: భార్య, ఆమె ప్రియుడి తలలు నరికి.. వాటితో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త