Weather Update: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. మరో మూడు రోజులు నాన్‌స్టాప్ వానలే వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మరో మూడు రోజుల పాటు ఇలానే వర్షం కురుస్తుందని వెల్లడించింది.

New Update
Rains

Rains

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే వర్షం స్టార్ట్ అయ్యింది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మరో మూడు రోజుల పాటు ఇలానే నాన్‌స్టాప్ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల గంటలకు 30 నుంచి 40  కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ !

ఈ జిల్లాలో భారీ వర్షాలు..

వచ్చే 24 గంటల్లో తెలంగానలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజమాబాద్, కామారెడ్డి, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, జనగాం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, ములుగు, నారాయణ పేట, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్, హయత్  నగర్, శేరిలింగపల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, పెద్దమ్మతల్లి గుడి, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, వేవ్ రాక్, పటాన్ చెరువు, లింగంపల్లి, మెహిదీపట్నం, మణికొండ, సికింద్రాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు యూసఫ్‌గూడ, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఏపీలో ఈ జిల్లాలు..

తెలంగాణతో పాటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, కడప, రాయలసీమ, అనంతపూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు తెలిపారు. అత్యవసరం సమయం ఉంటేనే బయటకు వెళ్లాలని తెలిపారు.

ఇది కూడా చూడండి: TG-AP Rains: తెలంగాణ, ఏపీకి రెయిన్ అలర్ట్.. డేంజర్‌లో ఉన్న జిల్లాలివే!

Advertisment
తాజా కథనాలు