AP Crime news: ఏపీలో విషాదం.. గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రీసు సూరి ఇంటి మట్టిగోడ కూలిపోయింది. ఆదివారం ఆ గోడ మట్టిని తీస్తుండగా పక్కనున్న మరో ఇంటిగోడ కూలీపోయి ఇద్దరు కూలీలు మృతి చెందారు.