AP Crime: కాకినాడలో కలకలం.. పెళ్లైన 6 నెలలకే వివాహిత ఆత్మ**హత్య.. అసలు కారణం అదేనా..?

కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం ఐదు నెలలకే ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీషగా గుర్తించారు.

New Update
Kakinada Crime News

Kakinada Crime News

కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నంలో విషాదకర ఘటన(ap-crime-news) చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం ఐదు నెలలకే ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య(suicide) చేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీషగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీషకు అదే గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్‌తో ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. భర్త ప్రదీప్ కుమార్ ఉద్యోగం నిమిత్తం గత మూడు నెలలుగా గోపాలపట్నంలో నివాసం ఉంటున్నాడు. ప్రదీప్ తొండంగి మండలంలోని దివీస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు.

ఆత్మహత్యపై సూసైడ్ నోట్‌లో..

ఆత్మహత్యకు ముందు శిరీష తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడింది. ఆ తరువాత తండ్రి తిరిగి ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే గోపాలపట్నం చేరుకోగా.. అప్పటికే శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఇలా కుతూరు మృతి చెందటంలో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఇది కూడా చదవండి: భార్యకు అనారోగ్య సమస్యలు.. చెప్పకుండా పెళ్లి చేశారని..అనస్తీషియా ఇచ్చి...

సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో శిరీష.. తన చావుకు అత్త, భర్త వేధింపులే కారణమని స్పష్టంగా పేర్కొంది. భర్తపై ప్రేమను వ్యక్తం చేస్తూనే.. తాను చేసిన పనికి అతని కోపం అసహ్యంగా మారిందనే బాధను తెలిపింది. నా చావుకి కారణం అత్త, భర్త వేధింపులే. ప్రదీప్ నిజంగా నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. నా వల్ల ఎలాంటి గొడవలు పడకండి. నువ్వు మంచిగా ఉండు, నువ్వు అంటే చాలా ఇష్టం. మిస్ యూ ప్రదీప్, గుడ్ బై అని సూసైడ్ నోట్‌లో రాసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్త, భర్త వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలిని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వీడేం భర్త.. భార్య తలపై సుత్తితో కొట్టి చంపేశాడు.. తర్వాత ఏమైందంటే?

Advertisment
తాజా కథనాలు