BIG BREAKING: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో బిగ్ రిలీఫ్

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. విదేశీ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. ఈ నెల 26 నుంచి నవంబర్‌ 4 వరకు ఎంపీ మిథున్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

New Update
YCP MP Mithun Reddy

YCP MP Mithun Reddy

వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. విదేశీ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. ఈ నెల 26 నుంచి నవంబర్‌ 4 వరకు ఎంపీ మిథున్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విదేశీ పర్యటన తర్వాత పాస్‌పోర్టు కోర్టుకు అప్పగించాలని ఆదేశించింది. విదేశాల్లో ఎక్కడికి వెళ్తారో.. ఎక్కడ ఉంటారో వివరాలు ఇవ్వాలని తెలిపింది. ఏపీ మద్యం కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. 

Also Read: అఫ్గాన్, భారత్‌తో యుద్ధానికి సిద్ధం.. పాక్‌ సంచలన ప్రకటన

Also Read: పిచ్చి వేషాలు వేస్తే...లోపలికి వెళ్ళి మరీ చంపేస్తాం..హమాస్‌ను హెచ్చరించిన ట్రంప్

ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి A4గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జులైలో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. దాదాపు 71 రోజుల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. దాదాపు 71 రోజుల జైలు జీవితం తరువాత గత నెల 29న మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజైరు చేసింది. 2 ష్యూరిటీలు, రూ.2లక్షల పూచీకత్తు ఇవ్వాలని షరతులు విధించింది. వారంలో 2సార్లు విచారణకు హాజరుకావాలని కండిషన్లు పెట్టింది. 

Advertisment
తాజా కథనాలు