Bomb Threat: ఆ జిల్లా కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపులు

ఏపీలో తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో సమాచారం మేరకు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. పరిసర ప్రాంతాలను పరిశీలించగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.

New Update
Bomb Threat To Tirupati Collectorate

Bomb Threat To Tirupati Collectorate

ఏపీలో తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో సమాచారం మేరకు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కలెక్టరేట్‌లో ఉన్న విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించాయి. చివరికి ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. అయితే తమిళనాడు నుంచి తిరుపతి కలెక్టరేట్‌కు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 

Also read: రైతుల వెంటపడ్డ పులి, భయంతో చెట్లెక్కిన స్థానికులు.. వీడియో వైరల్

గత కొంతకాలంగా నుంచి ఇలా పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపుల మెయిల్స్‌ వస్తున్నాయి. స్కూల్స్, కాలేజీలు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో బాంబులు పెట్టామంటూ కేటుగాళ్లు మెయిల్స్‌ పంపిస్తున్నారు. అంతేకాదు పలువురు రాజకీయ నాయకులకు కూడా ప్రత్యేకంగా బెదిరింపు మెయిల్స్‌ చేస్తున్నారు. 

Also read: ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద డ్రోన్ల దాడి..అంధకారంలో ఎనిమిది ప్రాంతాలు

Advertisment
తాజా కథనాలు