Kavitha: తిరుపతి చేరుకున్న కల్వకుంట్ల కవిత..జై కవిత నినాదాలతో మారుమోగిన విమానశ్రయం

 తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర నేపథ్యంలో తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కవిత తిరుపతి చేరుకున్నారు.

New Update
Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha in Tirupati

Kalvakuntla Kavitha : తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(mlc-kalvakuntla-kavitha) తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర నేపథ్యంలో తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కవిత తిరుపతి చేరుకున్నారు. తన భర్త అనిల్, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారితో కలిసి శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి(tirupati) కి ప్రయాణమయ్యారు. కవితకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.. శనివారం హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు కవిత.

Also Read :  దీపావళి బంపరాఫర్.. కేవలం రూ.11కే 2TB క్లౌడ్ స్టోరేజ్

కాగా, రేణిగుంట విమానాశ్రయంలో ఆమెను శాలవాలతో సత్కరించి స్వాగతం పలికారు. పలువరు జై కవితక్క అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని  చెప్పి  కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు..కేంద్ర ప్రభుత్వ మోసానికి వ్యతిరేకంగా తెలంగాణలో బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు.. తెలంగాణలో బీసీలు బందుకు పిలుపునిస్తే కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు పాల్గొనడం చూస్తుంటే హంతకుడే నివాళులర్పించినట్టు ఉందన్నారు..తెలంగాణలోని ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుందన్నారు.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం అని ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ నితీష్ కుమార్ ల పైన ఆధారపడి ఉందని తెలిపారు. కచ్చితంగా బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు వస్తుందన్నారు. అనంతరం కవిత శ్రీవారి దర్శనానికి బయలు దేరి వెళ్లారు. కాగా జనం యాత్ర కవిత తెలంగాణలో కొత్త పార్టీ పెడుతుందన్న ప్రచారం సాగుతోంది.

Also Read :  పిల్లల చర్మం ఎంతో సున్నితం.. ఈ 3 వస్తువులు ఉంచండి వారికి దూరం!

కాగా శనివారం రాత్రి తిరుపతి చేరుకున్న కవిత ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.. అనంతరం హాథిరాం బావాజీ మఠాన్ని సందర్శించి బర్సి ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేస్తారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఈనెల 21న యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం 25 నుంచి జనంబాట యాత్ర ప్రారంభిస్తారు.

కొనసాగుతున్న భక్తుల రద్దీ

కాగా  తిరుమలలో భక్తలు రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,136 మంది భక్తులు దర్శించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

Also Read :  రోజుకు రెండు ఖర్జూర పండ్లు.. ఎన్నెన్నో ప్రయోజనాలు

Advertisment
తాజా కథనాలు