/rtv/media/media_files/2025/10/18/cm-chandrababu-2025-10-18-21-30-10.jpg)
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా ఒక డీఏను ప్రకటించారు. అయితే దీనిని రెండు విడుతలుగా ఇస్తామన్నారు. నవంబర్ లో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105కోట్లు చెల్లిస్తామని తెలిపారు. ఉద్యోగులకు డీఏలకు దీని కోసం ప్రతి నెలా రూ, 160 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం రూ.7వేల కోట్ల వరకు డీఏ పెండింగ్లో ఉంది. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఉద్యోగులకు తెలియాలి. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులది కీలక పాత్ర. రాష్ట్ర ఆదాయంలో 90 శాతం సంక్షేమ పథకాలు, మానవవనరులకే ఖర్చు చేస్తున్నాం. -సీఎం చంద్రబాబు…
— NTV Breaking News (@NTVJustIn) October 18, 2025
అర్థిక ఇబ్బందులు ఉన్న డీఏ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుకగా ప్రమోషన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు అని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులది కూడా కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక గత ప్రభుత్వం రూ. 7 వేల డీఏలు పెండింగ్ లు పెట్టిందన్నారు. వైసీపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు చంద్రబాబు.