Aptdc : కార్తిక మాసం బంపరాఫర్.. రూ.2 వేలకే పంచారామాల దర్శనం

శివభక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భక్తులు ఒకే రోజులో రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను APTDC అందుబాటులోకి తెచ్చింది.

New Update
pancharama

శివుడికి అత్యంత పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) శివభక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భక్తులు ఒకే రోజులో రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను APTDC అందుబాటులోకి తెచ్చింది.

ఒకే రోజులో ఐదు పంచారామ క్షేత్రాలు

ఈ ప్రత్యేక ప్యాకేజీ ధరను సుమారు రూ. 2,000 గా నిర్ణయించినట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే సర్వీసులను బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ. 2,500 వరకు కూడా ధర ఉండవచ్చు. ఈ యాత్రలో ఒకే రోజులో రాష్ట్రంలోని ఐదు పంచారామ క్షేత్రాలైన అమరావతి (అమరారామం), భీమవరం (సోమారామం), పాలకొల్లు (క్షీరారామం), ద్రాక్షారామం (భీమారామం), సామర్లకోట (కుమారారామం)లోని శివాలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. పవిత్ర కార్తీక మాసంలో భక్తులు సులభంగా, తక్కువ ఖర్చుతో పంచారామాల దర్శనం చేసుకునేందుకు ఈ ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని APTDC అధికారులు తెలిపారు.

ప్రతి సోమవారం విజయవాడలోని ఏపీ టూరిజం కార్యాలయం నుంచి ఈ బస్సులు బయల్దేరతాయని ఏపీటీడీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్‌ 27, నవంబర్‌ 3, 10, 17 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పంచారామాల దర్శనానికి పెద్దలకు రూ.2130, పిల్లలకు రూ.1760 చొప్పున టికెట్‌ ధరను నిర్ణయించింది. బుకింగ్‌ల కోసం www.tourism.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.  

Advertisment
తాజా కథనాలు