Cyclone: ఏపీకి రెడ్ అలెర్ట్.. దూసుకొస్తున్న తుపాను
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉండటంతో ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 50–70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం అప్రమత్తమై ప్రజలను జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలుగు రాష్టాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం 11:12 గంటలకు (IST) రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఈ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
తెలంగాణలో రాగాల మూడు నాలుగు రోజుల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు తెలిపింది.
ఏపీలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని imd తెలిపింది. hydలో పొడి వాతావరణం ఉండి, రాత్రి వేళ చలి పెరిగుతుంది. TGలో రాబోయే 3రోజులు ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈశాన్య రుతుపవనాల వల్ల ఏపీకు నేడు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.