Weather Update: ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు దంచుడే దంచుడు!

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
rains

rains

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తన ప్రభావం వల్ల కోస్తా ఆంధ్రలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కోనసీమ, NTR, శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Konda Surekha: మంత్రి ఇంటి దగ్గర ఫుల్ డ్రామా...పోలీసుల ఎదురుగానే ఒకే కారులో వెళ్ళిన సురేఖ, సుమంత్

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

తెలంగాణలో హన్మకొండ, వరంగల్, జనగాం, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

ఇది కూడా చూడండి: Maoist leader Mallojula surrenders : మావోయిస్టు అగ్రనేత మల్లోజుల లొంగుబాటు..ఆయన ఉద్యమ ప్రస్థానమిదే..

Advertisment
తాజా కథనాలు