/rtv/media/media_files/2025/10/25/cyclone-to-cross-andhra-coast-near-kakinada-on-oct-28-2025-10-25-15-05-18.jpg)
Cyclone to Cross Andhra Coast Near Kakinada on Oct 28
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు తుపాను(cyclone) ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ తుపాను ప్రభావం ఉంటుందని చెప్పింది. అక్టోబర్ 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపానుగా తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. '' తుపాను వచ్చిన సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
Cyclone To Cross Andhra
వైజాగ్ నుంచి తిరుపతి వరకు ఈ తుపాను ప్రభావం ఉండనుంది. అలాగే హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు(Heavy Rains) కురిసే ఛాన్స్ ఉందని'' వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థలకు ఈనెల 28,29 తేదీల్లో సెలవు ప్రకటించాలని సూచించారు. అలాగే దూర ప్రయాణాలు మానుకోవాలన్నారు. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ముఖ్యంగా దివిసీమ, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, గోదివారి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
The depression over southeast Bay ofBengal moved nearly westwards with a speed of 7 kmph during past 3 hours andlay centred at 0830 hrs IST of today, the 25th October 2025, over the sameregion, near latitude 10.8°N & longitude 88.8°E, about 440 km west-southwest of Port Blair… pic.twitter.com/2FM0uikIwg
— India Meteorological Department (@Indiametdept) October 25, 2025
Follow Us