/rtv/media/media_files/2025/08/19/rains-2025-08-19-07-59-05.jpg)
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలుగు రాష్టాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలైన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ లేదా ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి.
ఉరుములు, మెరుపులతో కూడిన
ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట వంటి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ మరియు వాతావరణ శాఖ సూచించాయి.