Earthquake : కుదిపేసిన మరో భారీ భూకంపం.. పండుగ రోజు పరుగులు తీసిన ప్రజలు

పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం 11:12 గంటలకు (IST) రిక్టర్‌ స్కేలుపై 4.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఈ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

New Update
7.1 earthquake hits Tonga in South Pacific

Earthquake

పాకిస్థాన్ దేశాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజులుగా భూప్రకంపనలు సంభవిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం (అక్టోబర్ 20) మరోసారి బలమైన భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. 

Earthquake hits Pakistan

సమాచారం అందుకున్న వెంటనే అధికారులు పరిస్థితిని పర్యావేక్షిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. భూకంప కేంద్రం (NCS) భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు NCS వెల్లడించింది. భూకంప కేంద్రం ఉపరితలానికి దగ్గరగా 10 కిలోమీటర్ల లోతులో ఉండడం వల్ల ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది. దీని కారణంగా పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. 

ఈ వరుస ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారత ప్రామాణిక కాలమానం ప్రకారం.. ఉదయం 11:12 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఇంతక ముందు గత శనివారం, ఆదివారం పాకిస్తాన్‌లో 4.0 తీవ్రతతో కూడిన భూకంపాలు సంభవించాయి. దీని వలన ఈ ప్రాంతం భూకంప కార్యకలాపాలకు ఎక్కువగా గురవుతుంది. 

భూకంపం జరిగిన ప్రదేశాన్ని NCS తన అధికారిక ట్విట్టర్ (X) ఖాతాలో పోస్ట్ చేసింది. దాని అక్షాంశం 30.51 N, రేఖాంశం 70.41 Eగా పేర్కొంది. దీనిపై నిపుణుల ప్రకారం.. ఉపరితల భూకంపాలు మరింత ప్రమాదకరమైనవని.. వాటి భూకంప తరంగాలు ఉపరితలానికి తక్కువ దూరం ప్రయాణిస్తాయని చెబుతున్నారు. ఫలితంగా బలమైన ప్రకంపన, ఎక్కువ నష్టం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పాకిస్థాన్ దేశం భౌగోళికంగా ఇండియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే సరిహద్దు ప్రాంతంలో ఉండటం వలన తరచుగా ఈ విధంగా భూకంపాలు సంభవిస్తుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలు యురేషియన్ బెల్ట్ దక్షిణ అంచున ఉన్నాయి. అలాగే సింధ్, పంజాబ్ భారత బెల్ట్ వాయువ్య అంచున ఉన్నాయి. ఈ టెక్టోనిక్ ఘర్షణల కారణంగా పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలు తరచుగా భూకంపాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు