/rtv/media/media_files/2025/08/19/rains-2025-08-19-07-59-05.jpg)
Rains
Weather: తెలంగాణలో రాగాల మూడు నాలుగు రోజుల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళఖాతంపై అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఇది 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులతూ దక్షిణ మధ్య బంగాళఖాతంలో వాయుగుండగా బలపడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆదివారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో వర్షాలు కురవున్నట్లు తెలిపింది.
Also Read: కూతుళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. లవ్-జిహాద్ పై ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు
ఇక సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. బుధవారం, ఉమ్మడి కరీంగర్, ఖమ్మం, వరంగల్ అలాగే రంగారెడ్డి, హైదరబాద్, మెదక్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో ఖమ్మం, కొత్తగూడెంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లు TGDPS పేర్కొంది.
Also Read: దీపావళి పండగను క్రిస్మస్ లాగా చేసుకోండి.. అఖిలేష్ సంచలన కామెంట్స్!