Rains: తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో హై అలర్ట్

ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

New Update
Rains

Rains

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడకుండానే ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరం దాటిన నేపథ్యంలో.. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఏకంగా 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇందులో ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కర్నూలు జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలు ఉన్నాయి. 

14 జిల్లాలకు రెడ్ అలర్ట్..

ఇది కూడా చదవండి: ముఖంపై ముడతలు రావొద్దంటే.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి!

ముఖ్యంగా పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఆకస్మిక వరదలు హెచ్చరిక సైతం జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుగుణంగా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: గీజర్ శుభ్రం చేయడం ఎలానో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు