Earthquake: భారత్ సహా నాలుగు దేశాలను కుదిపేసిన భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

మరోసారి భూకంపం ప్రజలను భయపెట్టింది. భారతదేశం, మయన్మార్‌, జపాన్, కోరల్ సముద్రంలో భూకంపం సంభవించింది. భారత్ లో 3 తీవ్రతతో స్వల్ప భూకంపం, కోరల్ సముద్రంలో 6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అయితే నాలుగు దేశాలలో ఎక్కడా ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు.

New Update
Earthquake

Earthquake

మరోసారి భూకంపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. భారతదేశం, మయన్మార్‌తో సహా నాలుగు దేశాలలో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. భారతదేశంలో 3-తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించగా.. కోరల్ సముద్రంలో 6-తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. అయితే నాలుగు దేశాలలో ఏ ఒక్కదానిలోనూ ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

భూకంపాలు ఈ మధ్య కాలంలో ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నాయి. బలమైన ప్రకంపనల కారణంగా కొన్ని చోట్ల భారీగా ప్రాణ నష్టం, మరికొన్ని చోట్ల ఆస్తి నష్టం జరిగడం ఇటీవల కాలంలో చూశాం. తాజాగా మరో నాలుగు దేశాలలో భూప్రకంపనలు సంభవించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. ఇవాళ (అక్టోబర్ 26 ఆదివారం) ఉదయం కోరల్ సముద్రంలో సంభవించిన భారీ భూకంపం పసిఫిక్ మహాసముద్రం రీజియన్ లోని వనౌటులో కూడా కనిపించింది. అదే సమయంలో జపాన్, మయన్మార్, భారతదేశంలో కూడా భూకంపాలు సంభవించాయి. 

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. కోరల్ సముద్రంలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా ఉందని తెలిపింది. అలాగే ఉదయం 4:58 గంటలకు సంభవించిన భూకంప కేంద్రం వనువాటు సమీపంలో కూడా 6.0 తీవ్రతతో నమోదైందని పేర్కొంది. భూమి ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో కనుగొనబడిందని.. ఇది ప్రమాదకరమైనదిగా నిరూపించబడిందని తెలిపింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేనప్పటికీ ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి.

జపాన్, మయన్మార్ లలో భూకంపం

మరోవైపు జపాన్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. ఈ తీవ్రత భూకంపం ఉత్తర జపాన్‌లోని తూర్పు హక్కైడో ప్రాంతాన్ని కుదిపేసింది. ఈ ప్రకంపనలు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి. దీంతో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. అలాగే మయన్మార్‌లో ఉదయం 4:42 గంటలకు భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3గా నమోదైంది. 

భారత్ లో భూకంపం

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం ఉదయం భారతదేశంలోని కర్ణాటక, లడఖ్ రాష్ట్రాలలో భూకంపం సంభవించింది. కర్ణాటకలో భూకంపం తెల్లవారుజామున 3:47 గంటలకు సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో నమోదైంది. అదే సమయంలో లడఖ్‌లో ఉదయం 7:30 గంటలకు భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో నమోదైంది. అయితే వీటి కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. 

Advertisment
తాజా కథనాలు