మంత్రి ఉత్తమ్ కు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. షెడ్యూల్ ప్రకారం మేళ్లచెరువులో ల్యాండింగ్ అవ్వాల్సి ఉండగా.. భారీ వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ శాఖ వద్దని సూచించింది. దీంతో పైలట్ కోదాడలో ల్యాండింగ్ చేశారు.

New Update
Uttam kumar reddy accident

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసర ల్యాండింగ్ చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు పైలట్ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం.. మంత్రి హెలికాప్టర్ మేళ్లచెరువు మండల కేంద్రంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..

అయితే.. భారీ వర్ష సూచన, గాలి దుమారం కారణంగా వాతావరణ శాఖ నుంచి అధికారులకు సూచనలు అందాయి. ఈ సమయంలో మేళ్ల చెరువలో ల్యాండింగ్ సరికాదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో కోదాడలోనే పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోదాడలో ల్యాండింగ్ అనంతరం మంత్రి రోడ్డు మార్గంలో మేళ్ల చెరువు వెళ్లిపోయారు. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటన కొనసాగుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటున్నారు. 
ఇది కూడా చదవండి:Balagam Actor: దీనస్థితిలో బలగం నటుడు..కిడ్నీలు ఫెయిల్.. గొంతు ఇన్ఫెక్షన్తో

Advertisment