Jagan Nellore Tour: జగన్‌ నెల్లూర్‌ పర్యటనలో ఉద్రిక్తత.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గురువారం చేపట్టిన నెల్లూరు పర్యటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే జగన్‌ పర్యటనలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌కు గాయాలు కావడం కలకలం రేపింది.

New Update
Jagan Tour

Jagan Tour

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గురువారం చేపట్టిన నెల్లూరు పర్యటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే జగన్‌ పర్యటనలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌కు గాయాలు కావడం కలకలం రేపింది. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ మాల కొండయ్య కుడి చేతికి తీవ్ర గాయమయ్యింది. వైసీపీ నేతల దాడిలో తాను గాయపడినట్లు కొండయ్య చెప్పారు. నెల్లూరు సిటీ ప్రెసిడెంట్‌ బొబ్బల శ్రీనివాస్‌, అతని వర్గీయులు దాడి చేసినట్లు పేర్కొన్నారు. 

నెల్లూరులో పర్యటించిన జగన్ జైల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లారు. ఆయన వెంట వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జగన్‌ను ఆహ్వానించేందుకు నల్లపు రెడ్డి వెళ్లగా ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. చివరికి వైసీపీ శ్రేణులతో కలిసి నల్లపురెడ్డి రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగారు. ఎస్పీ క్షమాపణ చెప్పాలంటూ వారు నినాదాలు చేశారు. జగన్‌ను తమ ఇంటికి తీసుకెళ్లే వరకు ఆందోళన ఆపేది లేదన్నారు. దీనివల్ల అక్కడ మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. 

Also Read: సంచలన నిర్ణయం.. 16 ఏళ్ల లోపు పిల్లలు యూట్యూబ్‌ వాడటంపై నిషేధం

గురువారం జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరులో భారీగా పోలీసులు మోహరించారు. ప్రధాన రహదారులు, కూడళ్లలో చెక్ పోస్టులు పెట్టారు. అలాగే చెన్నై- కోల్‌కతా హైవేలో కూడా తనిఖీలు చేపట్టారు. 113 మంది కన్నా ఎక్కువ ఉంటే కేసులు పెట్టి అరెస్టు చేస్తామంటూ హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులు, ప్యాసింజర్ వెహికిల్స్‌ను కూడా తనిఖీ చేశారు. అలాగే గ్రామస్థాయి నుంచి మాజీ మంత్రుల వరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Also Read: వధువుకు షాక్ ఇచ్చిన వరుడు..పెళ్లిమండపంలో శృంగార వీడియో లీక్

అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి  వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. దీంతో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు భారీగా మోహరించారు. జగన్ ఆయన ఇంటికి వెళ్లనున్న క్రమంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు పట్టణంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నామని చెప్పారు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం దీన్ని పట్టించుకోలేదు. తమపై ఎన్ని కేసులు పెట్టినా జగన్ దగ్గరకు వెళ్తామంటూ చెప్పారు.  

మరోవైపు క్వార్జ్ అక్రమ రవాణా, తవ్వకాలు, నిబంధనల ఉల్లంఘన వివిధ అభియోగాలతో కాకాణి గోవార్ధన్ రెడ్డి ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నెల్లూరు జైలులో ఉన్నారు. అయితే కూటమి సర్కార్‌ తనను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అభియోగాలతో నల్లపురెడ్డిపై కేసు కూడా నమోదైంది. ఇటీవల ఆయన ఇంటిపై కూడా దాడి జరిగింది. ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్‌ జగన్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించేందుకు బయలుదేరారు. 

Advertisment
తాజా కథనాలు