Woman Distress Message : అమ్మా నేను చనిపోతున్నా...తల్లికి పంపిన చివరి మెసేజ్..

అత్తింటి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. చనిపోయే ముందు తల్లికి పంపిన మెసేజ్ ఆమెకు చివరిదైంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. 

New Update
Last message to mother

Last message to mother

Woman Distress Message:  ఒకవైపు భర్తలను చంపుతున్న భార్యల కథనాలు రోజురోజుకు పెరుగుతుంటే.. అదే సమయంలో భార్యలకు అత్తింటివారి వేధింపులు కూడా తప్పటం లేదు. వరకట్నం కోసమని కొందరు, మగపిల్లాడు పుట్టలేదని మరికొందరు అత్తింటివారు నేటికి కోడళ్లను చంపుకు తింటూనే ఉన్నారు. చట్టాలు ఎన్నివచ్చినా ఈ విషయంలో మాత్రం ఆడవారికి న్యాయం జరగడం లేదనే చెప్పాలి. తాజాగా, అత్తింటి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. చనిపోయే ముందు తల్లికి పంపిన మెసేజ్ ఆమెకు చివరిదైంది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. 

ఇది కూడా చదవండి:ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన నౌఫాల్ తో ఫసీలాకు కొంతకాలం క్రితం పెళ్లయింది. పెళ్లి తర్వాత కొంతకాలం వీరికాపురం సజావుగానే సాగింది. కానీ, ఆ తర్వాత ఇంటిలో గొడవలు మొదలయ్యాయి. నౌఫాల్ భార్యను నిత్యం వేధించేవాడు. ఆమెకు కొడుకు పుట్టిన తర్వాత ఆ వేధింపులు మరింత రెట్టింపయ్యాయి. రోజు భర్త వేధింపులు ఎక్కువడంతో ఇక భరించలేకపోయింది. తన తల్లిదండ్రులకు చెప్పుకుని వారిని ఇబ్బంది పెట్టడం ఆమెకు ఇష్టం లేకపోయింది.దీంతో ప్రాణాలు తీసుకోవాలనుకుంది.. చనిపోయే ముందు తన తల్లికి వాట్సాప్ లో ఓ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్‌లో తన మానసిక సంఘర్షణంతా పంచుకుంది... ‘అమ్మా.. నేను చనిపోవాలనుకుంటున్నాను. నేను చనిపోకపోయినా వాళ్లే నన్ను చంపేస్తారు. నేను రెండో సారి గర్భం దాల్చాను. అయినా అత్తింటి కుటుంబం నుంచి నాకు వేధింపులు తప్పటం లేదు. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నా భర్త నన్ను కడుపుపై తంతున్నాడు.

ఇది కూడా చదవండి:తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డా... అనాథగా శిశు విహార్‌ల్లో రెండు నెలల పసికందు

నాపై దాడిచేసి ఇప్పటికే నా చేయి విరగ్గొట్టారు. ఇక మా అత్త నోరు తెరిస్తే చాలు బూతులు తప్ప మరో మాట ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను జీవించాలనుకోవడం లేదు. అంటూ ఆమె తన తల్లికి మెసెజ్ పంపింది.  దాన్ని చూసిన తల్లి వెంటనే ఫసీలా అత్తింటివారికి ఫోన్ చేసి తన బిడ్డను కాపాడాలని వేడుకుంది. అంతేకాదు, వెంటనే హుటాహుటిన ఫసీలా దగ్గరకు బయలుదేరారు కుటుంబసభ్యులు. కానీ అప్పటికే పరిస్థితి చెయ్యిదాటి పోయింది. తల్లిదండ్రులు వచ్చే సరికి ఫసీలా అత్తింట్లో విగతజీవిగా పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అంతేకాక భర్త నౌఫాల్, అత్త రామ్లాను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

Also Read : పార్టీ ఫిరాయించిన MLAలకు 3 నెలలే డెడ్‌లైన్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

Advertisment
తాజా కథనాలు