/rtv/media/media_files/2025/07/28/srishti-test-tube-baby-center-case-sensational-facts-2025-07-28-08-41-04.jpg)
Srishti Test Tube Baby Center Case Sensational facts
Srishti Fertility Centre:
సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో పలువురికి సరోగసి చేయకున్నా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత అంగీకరించారు. రాజస్థాన్ దంపతుల విషయంలోనూ అలాగే చేశామని నమ్రత తెలిపారు. సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సాగించిన డాక్టర్ నమ్రతను 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను విచారించిన పోలీసుల ముందు ఆమె పలు విషయాలను వెల్లడించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్ టారిఫ్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
రాజస్థాన్ దంపతులు డీఎన్ఏ నివేదికలు కావాలని అడిగితే విషయం బయటపడుతుందని తప్పించుకున్నామని నమ్రత తెలిపారు. అయితే వారు అంతటితో ఆగకుండా డీఎన్ఏ చేయించుకోవడంతో తమ మోసం వెలుగులోకి వచ్చిందని నమ్రత తెలిపారు. అయితే కొన్ని రోజులు సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని వారికి చెప్పామని.. అయినా వారు పదే పదే కాల్స్ చేయడంతో వారి సెల్ ఫోన్ల కాంటాక్ట్ ని పూర్తిగా బ్లాక్ చేశామని స్పష్టం చేశారు. అయనా వారినుంచి ఒత్తిడి ఎక్కువవడంతో అడ్వకేట్ అయిన తన కుమారున్ని రంగంలో దించినట్లు..నమ్రత తెలిపింది. తన కుమారుడి ద్వారా రాజస్థాన్ దంపతులను బెదిరించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేసిన విషయాన్ని.డాక్టర్ నమ్రత అంగీకరించారని పోలీసులు తేల్చి చెప్పారు.
మరోవైపు సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో నిర్వహిస్తు్న్న క్లినిక్ కు ఎక్కువ మంది ఐవీఎఫ్ కోసం వచ్చినవారేనని, వారిని అనేక రకాలుగా నమ్మించి సరోగసి వైపు మళ్లించి పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు నమ్రత ఒప్పుకుంది. ఇక వారికి సరోగసి చేసినట్లు నమ్మించడానికి గాంధీ ఆస్పత్రికి చెందిన అనస్తీషియా డాక్టర్ నమ్రతకు పూర్తిస్థాయిలో సహకరించాడు. గాంధీలో మత్తు డాక్టర్ అయిన సదానందం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అవసరమైనవారికి మత్తుమందు ఇచ్చేవాడు. దానికి నమ్రత కూడా అడిగినంత ఇచ్చింది. సదానందం సహకారంతో డాక్టర్ నమ్రత సృష్టిలో అనేకమందిని నమ్మించి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అటు ఏపీలోనూ కొంతమంది ఏఎన్ఎమ్ ల సహాయంతో సృష్టిని నడిపిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలను డబ్బులు ఇచ్చి తీసుకురావడానికి అక్కడి పలువురు ఏఎన్ఎంలు సహకరించినట్లు తెలుస్తోంది. గిరిజనుల్లో గర్భం దాల్చిన వారిని గుర్తించడం వారికి డబ్బులు ఆశ చూపి వారికి పుట్టిన బిడ్డలను తీసుకువచ్చి సృష్టికి అప్పగించడం వీరి డ్యూటీ. దీనికి పెద్ద మొత్తంలో నగదు, బహుమతులు ఇచ్చేది నమ్రత.
కాగా, అరెస్ట్ విషయంలో పలు రకాలుగా పోలీసులను ఇబ్బందులు పెట్టడమే కాకుండా తనను అరెస్ట్ చేసే అధికారం తెలంగాణ పోలీసులకు లేదంటూ వాదించిన నమ్రత ఈ రోజు విచారణలో మాత్రం తన తప్పును అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపొర్టులో పేర్కొనడం గమనార్హం. ఈ కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు నమ్రత చెప్పినట్లు రిమాండ్ రిపోర్టు వెల్లడిస్తుంది. పోలీసుల కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రత తన తప్పును అంగీకరించడమే కాక, అక్రమాలు నిజమేననని, తెలిసే ఈ తప్పులు చేశామని వెల్లడించడం సంచలనంగా మారింది.
Also Read: భారత్‌పై 25 శాతం సుంకాలు.. ఈ ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం