/rtv/media/media_files/2025/07/31/rahul-gandhi-ktr-2025-07-31-13-27-41.jpg)
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది ఓ చారిత్రాత్మక తీర్పు అని అభివర్ణించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ స్వాగతిస్తోందన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని సుప్రీంకోర్టు నిరూపించిందన్నారు. ఇందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్ గా అనర్హత వర్తించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు కేటీఆర్. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నానన్నారు.
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ స్పీకర్ దగ్గర గత ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉంది.
— BRS Party (@BRSparty) July 31, 2025
మూడు నెలల్లో ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం చరిత్రాత్మకం. ఉపఎన్నికలు ఎలా వస్తాయని అసెంబ్లీలో సుప్రీంకోర్టును తప్పు పట్టేలా… pic.twitter.com/30jBcqzPdv
చెప్పే మాటలకు, నీతులకు కట్టుబడి ఉండాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు. దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పాంచ్ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయబోరని ఆశిస్తున్నానన్నారు. పార్టీ మారిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. బీఆర్ఎస్ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం అవుతోందన్నారు. ఈ దిశగా పని చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతిమంగా సత్యం, ధర్మం గెలిచిందన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లోపు వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సుధీర్ఘ కాలం పాటు పిటిషన్లను పెండింగ్ లో ఉంచడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో మూడు నెలల్లోపు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్యపై చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో వీరిపై అనర్హత వేటు పడుతుందని.. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక రావడం ఖాయమని బీఆర్ఎస్ చెబుతోంది.