/rtv/media/media_files/2025/07/31/kcr-public-meeting-in-karimnagar-2025-07-31-13-40-51.jpg)
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో గురువారం కేసీఆర్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. కేటీఆర్, హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు భేటీలో పాల్గొన్నారు. కేసీఆర్ కరీంనగర్‌లో మరో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. కరీంనగర్‌లో ఆగస్టు 8న ఈ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. కరీంనగర్ కేసీఆర్‌కు సెంటిమెంట్ జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన 'సింహ గర్జన' సభ కరీంనగర్‌లోనే జరగడం విశేషం.
భేటీలో నేతలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి సుప్రీం తీర్పుపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్ట్, బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై కూడా చర్చించనున్నారు.
ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం
— Telugu Stride (@TeluguStride) July 31, 2025
కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలతో సమావేశమైన కేసీఆర్
కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించే అవకాశం#KCR#KTR#BRS#Telanganapic.twitter.com/1Wo88DBI9I
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యంగా, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టడమే ఈ సభ ప్రధాన లక్ష్యం. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి, దానిపై పలువురు నాయకులు రాష్ట్రపతిని కలవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఈ సభను నిర్వహిస్తోంది.
ఎర్రవెల్లి నివాసంలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో సమావేశమైన కేసీఆర్ pic.twitter.com/gGmK3tSWxH
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2025
బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్. మధుసూదనాచారి, గంగుల కమలాకర్ వంటి వారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని, వారి హామీలలో నిజాయితీ లేదని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరినప్పటికీ, కాంగ్రెస్ దానిని వ్యతిరేకించిందని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాటకాలు ఆడుతోందని విమర్శిస్తున్నారు. కేసీఆర్ ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై వారి ద్వంద్వ వైఖరిని ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు.
ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం నింపి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు, భవిష్యత్ రాజకీయాలకు బీఆర్ఎస్ శ్రేణులను సిద్ధం చేయాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కరీంనగర్ సెంటిమెంట్ కేసీఆర్‌కు తిరిగి అధికారం తెస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
karimnagar | public-meeting | brs-public-meeting | latest-telugu-news | KCR farmhouse | jagadeesh-reddy | Harish Rao