/rtv/media/media_files/2025/07/28/srishti-test-tube-baby-center-2025-07-28-18-16-48.jpg)
Universal Shrishti Fertility Center
Universal Shrishti Fertility Center : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సరోగసీ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రతను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. టెస్ట్ ట్యూబ్ బేబీ విషయంలో దోషిగా ఉన్న ఆమెను 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదవ అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. అక్రమ సరోగసీ, శిశు విక్రయాలకు సంబంధించిన కేసులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ యజమాని అయిన డాక్టర్ అతలూరి నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణ, మరికొంత మందిని గోపాల పురం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్ టారిఫ్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
కాగా సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడంతో పాటు శిశువిక్రయాలు, మోసపూరిత వైద్యం తదితర అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యురాలు నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్టలను కస్టడీకి ఇవ్వాల్సిందిగా గోపాలపురం పోలీసులు సికింద్రాబాద్ కోర్టును కోరిన విషయం తెలిసిందే. నమ్రత వద్ద సరోగసీ, ఐవీఎఫ్ కోసం వచ్చిన వారు చాలా మంది మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇష్టం లేకనో, ఆర్థిక స్థోమత లేకనో అబార్షన్ చేయించుకోవాలనుకున్నా దంపతులను గుర్తించి, వారికి తమ ఏజెంట్ల ద్వారా డబ్బు ఆశ చూపి వారిని ఒప్పించి.. వారికి పుట్టే చిన్నారులను నమ్రత తన అక్రమ దందాకు ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.దీంతో వారి వివరాలు సేకరించడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే నమ్రత వద్ద చికిత్స చేయించుకున్న వారి వివరాలు లభ్యమయ్యాయని, మరిన్ని విషయాలు రాబట్టేందుకు వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు..డాక్టర్ నమ్రతను 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. నమ్రతను విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి:తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డా... అనాథగా శిశు విహార్‌ల్లో రెండు నెలల పసికందు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌కు చెందిన సోనియా, గోవింద్ సింగ్ దంపతులకు పిల్లలు లేరు. దీంతో ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో పిల్లలను కనేందుకు గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతను సంప్రదించారు. అయితే ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టడం సాధ్యం కాదని, సరోగసితో అయ్యే అవకాశం ఉందని వారికి చెప్పింది.దీనికి రూ.30 లక్షలు ఖర్చు అవుతాయని, రూ.15లక్షల నగదు, మరో రూ.15లక్షలకు చెక్కు ఇవ్వాలని నమ్రత కోరారు. ఆమె చెప్పిన ప్రకారంమే ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు.ఆ తర్వాత మొదటిసారి గత ఆగస్టులో రూ.5లక్షలు నమ్రత ఖాతాకు వారు బదిలీ చేశారు. సెప్టెంబర్‌లో నిర్వాహకులు విశాఖకు దంపతులను పిలిచి స్పెర్మ్, అండం సేకరించారు. ఆ తర్వాత విడతల వారీగా బాధితులు డాక్టర్ నమ్రత ఖాతాలో నగదును జమ చేశారు. ఈ ఏడాది మే నెల నాటికి మొత్తం నగదును బాధితులు నమ్రతకు చెల్లించారు. అయితే డెలీవరీ అనంతరం ఒప్పందం ప్రకారం దంపతులు ఆ బిడ్డకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని కోరారు. ఇందుకు డాక్టర్ నమ్రత అంగీకరించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ దంపతులు శిశువుకు ఢిల్లీలో డీఎన్ఏ పరీక్ష చేయించగా, అందులో పుట్టిన బిడ్డ తమ బిడ్డ కాదని తేలింది. దీంతో సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ నిర్హహకురాలు నమ్రతను నిలదీశారు. అయితే ఆమె సరైన సమాధానం ఇవ్వకపోవడంతో గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ను స్వీకరించిన పోలీసులు డా.నమ్రతతో పాటు, ఆమె కుమారుడు, సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. అయితే నమ్రతను విచారిస్తే కీలక విషయాలు బయటపడతాయని భావిస్తున్న పోలీసులు ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో 5 రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
ఇది కూడా చదవండి:ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి