/rtv/media/media_files/2025/07/31/kerala-adds-20-rupees-deposit-fees-on-plastic-liquor-bottle-2025-07-31-21-34-09.jpg)
Kerala adds 20 rupees deposit fees on plastic liquor bottle
వైన్స్ షాపుల్లో ప్రతిరోజూ గిరాకీ ఉంటుంది. రాత్రి అవ్వగానే మద్యం షాపులకు మందుబాబులు క్యూలు కట్టేస్తారు. సాధారణంగా ఎవరైనా మద్యం సేవించాక వైన్ బాటిల్‌ను ఎక్కడంటే అక్కడే పారేస్తారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వైన్ బాటిళ్లు బయట ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఈ విషయంలో కేరళ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇకనుంచి మద్యం సేవించాక దాని వైన్ బాటిల్‌ను తిరిగి ఇస్తే రూ.20 తిరిగి ఇవ్వనుంది. అయితే ప్లాస్టిక్ బాటిళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
Also read: అమ్మా నేను చనిపోతున్నా...తల్లికి పంపిన చివరి మెసేజ్..
ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం కేరళలో బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 70 కోట్ల మద్యం సీసాలు అమ్ముడుపోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల కేరళ.. ప్రధాన ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిదారుగా ఉంది. మద్యం అమ్ముడవుతున్న మొత్తం బాటిళ్లలో చూసుకుంటే వాటిలో కేవలం 56 కోట్ల బాటిళ్లు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. మిగితాని వ్యర్థాలుగానే ఉండిపోతున్నాయి. వీటిని తగ్గించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్న ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఎం.బి రాజేశ్ వెల్లడించారు.
Also Read: సంచలన నిర్ణయం.. 16 ఏళ్ల లోపు పిల్లలు యూట్యూబ్ వాడటంపై నిషేధం
గాజు సీసాల్లోనే మద్యం నింపాలని సూచనలు చేశారు. రూ.800 అంతకన్నా ఎక్కువగా ఉండే మద్యాన్ని గాజు సీసాల్లోనే ఇవ్వాలని ఆదేశించారు. రూ.800 కంటే తక్కువ ధర కలిగిన మద్యాన్ని ప్లాస్టిక్ బాటిళ్లలో సరఫరా చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని ప్రాంతాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి విధానాన్ని ఇప్పటికే తమిళనాడు పాటిస్తోంది.
Also Read: వధువుకు షాక్ ఇచ్చిన వరుడు..పెళ్లిమండపంలో శృంగార వీడియో లీక్
బెవ్‌కో, క్లీన్ కేరళ కంపెనీ, ఎక్సైజ్ శాఖ, సుచిత్వ మిషన్ సంయుక్తంగా ఈ పథకాన్ని పర్యవేక్షించనున్నాయి. ప్రస్తుతం పర్యావరణంలో ప్లాస్టిక్ విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కేరళ తీసుకున్న ఈ నిర్ణయంపై అక్కడి ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడంలో ఈ నిర్ణయం ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అమలు చేస్తున్న ఇలాంటి విధానాన్ని అధ్యయనం చేసిన తర్వాతే కేరళ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: తమ కంపెనీకి రావాలని రూ.8,750 కోట్లు ఆఫర్ చేసిన మెటా.. తిరస్కరించిన ఉద్యోగి
ప్లాస్టిక్ బాటిళ్లు అనేవి పర్యాణరణంలో పేరుకుపోయి నేల, నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్లాస్టిక్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా కేరళలోని పర్యాటక ప్రదేశాల్లో, గ్రామీణా ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా మద్యం సీసాలు పారేస్తున్నారు. దీనివల్లే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. అయితే ఈ తాజా నిర్ణయం వల్ల పరిస్థితులు మారుతాయని అధాకారులు భావిస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకోవడంతో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటాయో ? లేదో చూడాలి మరీ.