BIG BREAKING: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..

నారాయణపూర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన కేశవరావు వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి చేరారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడం, ఐఈడీ బాంబు తయారీ, పేల్చడం వంటి వాటిలో కేశవరావు దిట్ట.

New Update
Nambala kesavarao

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగ్గా 28 మంది మావోయిస్టులు మృతి  చెందారు. అబూజ్‌మడ్ ప్రాంతంలో ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. నంబాల కేశవరావు 1955లో శ్రీకాకుళం జిల్లా జయ్యన్న పేటలో జన్మించారు. కేశవరావు మాజీ కబడ్డీ ఆటగాడు. అలాగే ప్రస్తుతం ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్‌ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 

ఇది కూడా చూడండి:Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు

ప్రస్తుతం సెంట్రల్ మిలటరీ కమిషన్‌ చీఫ్‌గా ఉన్న నంబాలపై కోటిన్నర రివార్డు కూడా ఉంది. NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో నంబాల కేశవరావు పేరు కూడా ఉంది. గంగన్న పేరుతో ఏవోబీలో కార్యక్రమాలు నిర్వహించాడు. 1992లో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఎన్నికైన తర్వాత 2010లో దంతెవాడ దాడిలో ముఖ్య పాత్ర పోషించాడు. గణపతి రాజీనామాతో 2018లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

1970 నుంచి ఇప్పటి వరకు..

కేశవరావు తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. నంబాల కేశవరావు పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. అలాగే మావోయిస్టు సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ అధిపతిగా కూడా పనిచేశాడు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో కేశవరావు దిట్ట. అలాగే ఐఈడీ బాంబు తయారీ, పేల్చడంలో కూడా కేశవరావు ఆరితేరిన వాడు. అయితే 1970 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో ఉంటున్నాడు. అయితే మడ్ ప్రాంతంలో ఉన్నారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

ఇది కూడా చూడండి:TGCrime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్‌...! ఉరేసుకుని భార్య...

ఇది కూడా చూడండి:Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

Advertisment
తాజా కథనాలు