Youtube: సంచలన నిర్ణయం.. 16 ఏళ్ల లోపు పిల్లలు యూట్యూబ్‌ వాడటంపై నిషేధం

16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ జాబితాలో యూట్యూబ్‌ను కూడా చేర్చింది.

New Update
Australia adds YouTube to social media ban for under 16 Years

Australia adds YouTube to social media ban for under 16 Years

ప్రస్తుతం కాలంలో చిన్నా పెద్దా అందరూ మొబైల్‌ ఫోన్లు వాడుతున్నారు. ముఖ్యంగా ఒకరోజు సోషల్ మీడియా వాడకుండా ఎవరూ ఉండలేరు. అయితే 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలను పిల్లలు వినియోగించడంపై నిషేధం విధించింది. అయితే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ జాబితాలో యూట్యూబ్‌ను కూడా చేర్చింది. అయితే ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. 

Also Red: వధువుకు షాక్ ఇచ్చిన వరుడు..పెళ్లిమండపంలో శృంగార వీడియో లీక్

సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌ పిల్లలకు హానికరంగా మారిందని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పింది. సోషల్ మీడియాలో నిర్ణీత వయసు కన్నా తక్కువ ఉండే వాళ్లకు కూడా సోషల్ మీడియా ఖాతాలు తెరిచేందుకు పర్మిషన్ ఇంచే  సంస్థలకు దాదాపు 50 మిలియన్ డాలర్ల విధించనున్నట్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం యూట్యూబ్‌ వాడకంపై పూర్తిగా నిషేధం విధించలేదు. 16 ఏళ్ల లోపు పిల్లలు తమ పేరుతో యూట్యూబ్‌ ఖాతాలను సృష్టించకుండా నిషేధం విధించింది. ఇప్పటికే ఫేక్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, ఎక్స్‌ వంటి సోషల్ మీడియాలకు ఈ నిషేధాన్ని విధించింది. 

ఎందుకు నిషేధం ? 

ప్రస్తుతం సోషల్ మీడియాలో హానికరమైన కంటెట్, సైబర్‌ బుల్లింగ్ లాంటివి పెరిగిపోతున్నాయి. దీనివల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడనుంది. ఇలాంటి వాటి నుంచి పిల్లలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే యూట్యూబ్‌ అనేది ఇతర సోషల్ మీడియా లాగా కాకుండా వీడియో ప్లాట్‌ఫామ్‌ అయినప్పటికీ.. దీన్ని వాడితే ఇతర సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ లాగే ప్రమాదం ఉందని అధికారులు వాదిస్తున్నారు. 

Also Read: తమ కంపెనీకి రావాలని రూ.8,750 కోట్లు ఆఫర్‌ చేసిన మెటా.. తిరస్కరించిన ఉద్యోగి

దీనికి సంబంధించి ఆస్ట్రేలియాలో ఓ సర్వే కూడా చేశారు. ఇందులో 10 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లల్లో నలుగురిలో ముగ్గురు యూట్యూబ్‌ వాడుతున్నారని తేలింది. అలాగే హానికరమైన కంటెంట్‌కు గురైన పిల్లల్లో 37 శాతం మంది యూట్యూబ్‌లోనే చూసినట్లు బయటపడింది. అందుకే తాజాగా యూట్యూబ్‌పై కూడా కొరడా ఝళిపించింది. అయితే 16 ఏళ్ల లోపు పిల్లలు తమ అకౌంట్‌ లేకుండా యూట్యూబ్‌లో వీడియోలు చూడగలరు. కానీ కంటెంట్‌ను పోస్ట్‌ చేయడం, కామెంట్స్‌ చేసే అవకాశం ఉండదు. 

ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యూట్యూబ్ కూడా స్పందించింది. యూట్యూబ్‌ ఓ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్ అని సామాజిక మాధ్యమం కాదని పేర్కొంది. తదుపరి చర్యలు కొనసాగిస్తామని.. ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తామని పేర్కొంది. ఇదిలాఉండగా.. ఆస్ట్రేలియా సోషల్ మీడియాపై తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిర్ణయంగా పరిగణించబడుతోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇతర దేశాలు కూడా ఆస్ట్రేలియా విధానాన్ని పాటించే అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్‌ టారిఫ్‌‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!

Advertisment
తాజా కథనాలు