Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న సూర్యుడు.. రానున్న రెండ్రోజులు జాగ్రత్త

తెలంగాణలో రానున్న రెండు రోజులు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.

New Update
heat

heat

తెలంగాణలో గత కొంతకాలంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. జనవరి చివరి వారం నుంచే రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదు అవుతున్నాయి. మధ్యలో కొన్ని రోజులు వర్షాలు కురిసి వాతావరణం చల్లబడినా.. మళ్లీ రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలు అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ మామూలుగా మండడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఉదయం 10 తర్వాత రోడ్లు పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ వేడి, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

Also Read: భక్తులకు TTD అదిరిపోయే శుభవార్త.. ఇక క్యూ లైన్లో ఉండాల్సిన అవసరమే లేదు!

ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు మరింత మండుతాయని వాతావరణశాఖ పేర్కొంది. సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరింత ఎక్కువగా ఎండల తీవ్రత ఉంటుందన్నారు. 

Also Read: Mehul Choksi: బెల్జియంలో మెహుల్‌ ఛోక్సీ అరెస్ట్‌!

తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.. మరోవైపు ఏపీలోని కోస్తాంధ్ర, యానాం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల తెలంగాణలో రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుందని చెబుతున్నారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే రోజంతా తగినంత నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవాలి.లేత రంగుల్లో ఉండే కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.సూర్యరశ్మి నేరుగా తగలకుండా చూసుకోవాలి. 

టోపీలు, గొడుగులు ఉపయోగించాలి.చర్మాన్ని హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ లోషన్‌ను ఉపయోగించాలి.ఉదయం 10 దాటిన తరువాత,  సాయంత్రం 4 గంటల ముందు ఎండ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి.

తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వేయించిన, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.ఎండలో పనిచేసేవారు లేదా బయటకు వెళ్లినవారు అలసటగా అనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి.చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారి శరీరం త్వరగా డీహైడ్రేట్‌ అవుతుంది కాబట్టి వారికి తగినంత నీరు అందిస్తూ ఉండాలి, ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి.

Also Read: Delhi: చల్లదనం కోసం తరగతి గదులకు ఆవుపేడ అలికిన ప్రిన్సిపల్‌!

Also Read: Zelensky: ఉక్రెయిన్‌ కి వచ్చి చూడండి..మీకే తెలుస్తుంది ఏం జరుగుతుందో..!

telangana | temperatures | weather | Telangana Weather | telangana weather news | telangana weather report today | telangana weather updates | telangana-weather-report | telangana-weather-update | summer | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు