/rtv/media/media_files/2025/03/03/JIMpJ6iLegmuHTXyatE8.jpg)
Zelensky Photograph: (Zelensky)
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మాస్కో కీవ్ పై భారీగా దాడులకు పాల్పడుతోంది. ఆదివారం సుమీ నగరం పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం వల్ల 34 మంది మృతి చెందగా..117 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ..రష్యా చేసిన దాడి వల్ల జరిగిన వినాశనాన్ని ఇక్కడికి వచ్చి కళ్లారా చూడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోరారు.
Also Read: Delhi: చల్లదనం కోసం తరగతి గదులకు ఆవుపేడ అలికిన ప్రిన్సిపల్!
ఈ పర్యటనతో అయినా పుతిన్ చేస్తున్న విధ్వంసాన్ని ఆయన అర్థం చేసుకొని...ఎటువంటి వారితో ఒప్పందం చేసుకున్నారో తెలుసుకుంటారని జెలెన్ స్కీ అన్నారు. యుద్ధాన్ని ముగించాలని పుతిన్ ఎప్పుడూ కోరుకోలేదు.మా దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మాస్కో మా పై దాడులు చేస్తోంది.
Also Read: Mehul Choksi: బెల్జియంలో మెహుల్ ఛోక్సీ అరెస్ట్!
నేను పుతిన్ ను నమ్మనని చాలాసార్లు అమెరికా అధ్యక్షుడితో చెప్పాను. రష్యా మారణహోమం లో అనేకమంది చనిపోతున్నారు. దయచేసి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు,చర్చలు చేపట్టేముందు వారిని చూడటానికి రండి. దాడులు జరుగుతున్న ఏ నగరంలో అయినా మీరు పర్యటించవచ్చు అని జెలెన్ స్కీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఉక్రెయిన్ ప్రజలను హత్య చేస్తూ ..దేశంలో మారణకాండ సృష్టిస్తున్న పుతిన్ అంటే తనకు చెప్పలేనంత ద్వేషం ఉందని జెలెన్ స్కీ అన్నారు. అయితే ఈ శత్రుత్వం వల్ల యుద్ధాన్ని కొనసాగించడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. న్యాయమైన శాంతిని సాధించడమంటే మన సార్వభైమత్వాన్ని,స్వాతంత్య్రాన్ని కోల్పోకుండా ఉండడమే అని అన్నారు. తమ నుంచి రష్యా లాక్కున్న భూభాగాలని తిరిగి పొందడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగా రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు 30 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించారు.అందుకు కీవ్ అంగీకరించగా..మాస్కోసూత్రప్రాయంగా ఒప్పుకొంది.అయినప్పటికీ ఇరువర్గాలు దాడులను కొనసాగిస్తున్నాయి.
వారం రోజుల్లో మాస్కో కీవ్ పై భారీస్థాయిలో విరుచుకుపడింది. ఉక్రెయిన్ ప్రజలు ఆదివారం తమ పండగ చేసుకుంటున్న సమయంలో రష్యా క్షిపణి దాడులకు పాల్పడడంతో 20 మంది మృతి చెందగా వందల సంఖ్యలో గాయాల పాలైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ దాడులను జెలెన్ స్కీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన పై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్‌చేశారు.
రష్యా పై ఒత్తిడిలేకుండా..శాంతిస్థాపన అసాధ్యమన్నారు.ఓ ఉగ్రవాదితో ఏ విధంగా వ్యవహరిస్తారో..రష్యా పై అటువంటి వైఖరి అవసరమన్నారు.
Also Read: భక్తులకు TTD అదిరిపోయే శుభవార్త.. ఇక క్యూ లైన్లో ఉండాల్సిన అవసరమే లేదు!
Also Read: Ap Weather Report: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు.!
america | ukrain | zelensky | trump | russia | putin | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates