Delhi: చల్లదనం కోసం తరగతి గదులకు ఆవుపేడ అలికిన ప్రిన్సిపల్‌!

సాంప్రదాయ భారతీయ పద్దతులను ఉపయోగించి వేడి నియంత్రణ పద్ధతులను ఢిల్లీ యూనివర్సిటీ ప్రిన్సిపల్‌ పాటించారు. ఆమెనే స్వయంగా ఆవు పేడతో తరగతి గదులను అలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

New Update
delhi

delhi

Delhi: తరగతి గది గోడలకు ఓ ప్రిన్సిపాల్ ఆవుపేడను పూసిన ఘటన ఢిల్లీ యూనివర్సిటీ  పరిధిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కళాశాల  ప్రిన్సిపాల్ సిబ్బంది సహాయంతో క్లాస్ రూం గోడలకు ఆవుపేడను పూస్తున్న వీడియో ఒకటి బయటికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Vishwambhara: గ్రాఫిక్స్ గాలికి వదిలేశారా..? విశ్వంభరపై 'బన్ని' ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్

దీని గురించి ప్రిన్సిపాల్ ప్రత్యూష్ వస్తల మాట్లాడుతూ.. తాను చేసిన ఆ పని ఓ అధ్యాపకుడి పరిశోధనలో భాగమని, ఈ ప్రాజెక్టు పేరు సాంప్రదాయ భారతీయ పద్దతులను ఉపయోగించి వేడి నియంత్రణ అధ్యయనం అని చెప్పుకొచ్చారు.ఈ పరిశోధన  పోర్టా క్యాబిన్ లో నిర్వహించడం జరుగుతుందని, ఒక వారం తర్వాత ఈ పరిశోధనకు సంబంధించిన మొత్తం వివరాలను తెలియజేస్తానని పేర్కొన్నారు. అంతేగాక సహజంగా దానిని తాకడం వల్ల ఎటువంటి హాని ఉండదు కాబట్టి ఒక గదికి తానే ఆవు పేడను పూయడం జరిగిందని తెలిపారు. 

Also Read: UPI Transactions: మరోసారి ఆగిపోయిన యూపీఐ సేవలు.. గందరగోళానికి గురవుతున్న వినియోగదారులు

అంతేగాక పూర్తి వివరాలు తెలియక కొందరు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని, తానే స్వయంగా అధ్యాపకుల బృందానికి సంబంధించిన గ్రూప్ లో వీడియోను షేర్ చేసినట్లు తెలిపారు. కళాశాలలోని సీ బ్లాక్ లోని తరగతి గదులను చల్లగా ఉంచేందుకు దేశీయ పద్దతిని అవలంబిస్తున్నామని, త్వరలోనే ఈ గదులన్ని కొత్త రూపాన్ని సంతరించుకుంటాయని ప్రిన్సిపల్ వివరించారు.

Also Read: US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?

Also Read: Ap Weather Report: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు.!

delhi university | cow dung | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు