Mehul Choksi: బెల్జియంలో మెహుల్‌ ఛోక్సీ అరెస్ట్‌!

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని మోసం చేసిన కేసులో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.13,500 కోట్ల మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది. అతడ్ని అప్పగించాలని భారత్ కోరింది.

New Update
Choksi

Choksi

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని మోసం చేసిన కేసులో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఆయనపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. దాదాపు రూ.13,500 కోట్ల మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది. అతడ్ని అప్పగించాలని భారత్ కోరింది. అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read: Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!

డైమండ్ వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన గురించి భారతీయులకు బాగా తెలుసు. అంత బాగా పాపులర్ అయ్యాడు కూడా. పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరు చెప్పగానే ముందుగా ఆయన పేరే వస్తుంది. ఆ రేంజ్‌లో బ్యాంకుని మోసం చేశాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 13, 500 కోట్ల రూపాయలను మోసం చేసి విదేశాలకు పారిపోయాడు.

Also Read: Musk-Trump: ట్రంప్ మీటింగ్‌లో మస్క్ "టాప్ సీక్రెట్" నోట్..అసలు అందులో ఏముంది!

.వేల కోట్ల రూపాయలతో విదేశాలకు చెక్కేసిన నిందితుపై భారత్ దృష్టి పెట్టింది. వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్‌ ఛోక్సీ బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన బెల్జియం జైలులో ఉన్నాడు. ఛోక్సీపై తీవ్ర అభియోగాలు ఉండడంతో ఆయన్ని అప్పగించాలని బెల్జియం ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

భారత్ నుంచి పారిపోయిన మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య ప్రీతి చోక్సీ బెల్జియం పౌరురాలు. అయితే మెహుల్ చోక్సీ బెల్జియంలో ఉండటానికి ఎఫ్ రెసిడెన్సీ కార్డ్ పొందారు. అక్కడి చట్టాల ప్రకారం మెహుల్‌ ఛోక్సీ ఇండియాకు వస్తాడా? లేకుంటే విజయ్ మాల్యా మాదిరిగా అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించి కాలం గడిపేస్తాడా? అన్నది అసలు పాయింట్.


సరిగ్గా 2018 జనవరిలో భారత్‌కు ఓ కుదుపు కుదిపేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్. దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ ఇది. ఈ కుంభకోణం బయటపడటానికి కొద్దివారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు విదేశాలకు పారిపోయాడు. కుంభకోణం బయటకు రావడానికి ముందు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది.

ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. ఆయన్ని రప్పించేందుకు భారత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసులో ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. 2023లో బెల్జియంలో ఛోక్సీ ఉండటానికి అనుమతి దొరికింది. ఇండియా నుంచి నేరుగా వెస్టిండీస్ దీవులైన ఆంటిగ్వా, బార్బుడాలో నివసించాడు కూడా.

బెల్జియంలో స్థిరంగా ఉండేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు ఛోక్సీ. నకిలీ పత్రాలు సమర్పించి, అక్కడి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించాడనే ఆరోపణలు ఛోక్సీపై ఉన్నాయి.  65 ఏళ్ల మెహుల్ చోక్సీకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ట్రీట్ మెంట్ కోసం బెల్జియం నుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్లాడు.

ఆ తర్వాత బెల్జియంకు వచ్చాడని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛోక్సీ ఇండియాకు వస్తే ఇలాంటి ఫలితం ఉండదని అంటున్నారు. ఆయన ఆరోగ్యానికి మనం ఖర్చు చేయాల్సివస్తుందని అంటున్నారు. బ్యాంక్‌కు ఎగ్గొట్టిన  13 వేల కోట్ల రూపాయలను రాబట్టాలని అంటున్నారు.

Also Read: Ap Weather Report: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు.!

Also Read: భక్తులకు TTD అదిరిపోయే శుభవార్త.. ఇక క్యూ లైన్లో ఉండాల్సిన అవసరమే లేదు!

mohul choksi | punjab-national-bank | belgium | arrest | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు