Telangana: దుబాయ్‌లో ఇద్దరుతెలంగాణ వాసులను హత్య చేసిన పాక్‌ వ్యక్తి!

దుబాయిలో తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రిని ఓ పాకిస్థానీ దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.నిర్మ‌ల్ జిల్లా సోన్‌కు చెందిన అష్ట‌పు ప్రేమ్‌సాగ‌ర్ , నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ లు హత్యకు గురైనట్లు తెలుస్తుంది.

New Update
murder

murder

దుబాయిలో ఇద్దరు తెలంగాణవాసులను ఒక పాకిస్థానీ దారుణంగా నరికి చంపాడు. మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గతశుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒకరు నిర్మల్‌ జిల్లా సోన్‌ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్‌ (40) కాగా, మరొకరు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ అని.. గాయపడ్డ ఇద్దరూ కూడా తెలుగువారేనని తోటి ఉద్యోగులు చెప్పారు. 

Also Read: Anna Lezhneva: పవన్ సతీమణి తలనీలాలు ఇవ్వడంపై వివాదం.. వైరల్ అవుతున్న వీడియోలు!

మృతులు, గాయపడ్డ ఇద్దరు, ఈ ఘోరానికి పాల్పడిన పాకిస్థానీ... అందరూ దుబాయిలోని ఒక ప్రఖ్యాత బేకరీలో పని చేస్తున్నారు.పని ఒత్తిడి, ఇతర కారణాలకు మతవిద్వేషం కూడా తోడవడంతోనే దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని.. వారిని చంపిన తర్వాత అతడు మతపరమైన నినాదాలు చేశాడని తెలుస్తోంది. బేకరీ యాజమాన్యం ఈ దారుణానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. 

Also Read: తిరుమల లడ్డూను ఎంత జాగ్రత్తగా, పవిత్రంగా తయారు చేస్తున్నారో చూడండి.. వీడియో విడుదల చేసిన TTD!

విషయం ఏ మాత్రం బయటకు తెలిసినా ఉద్యోగాల్లోంచి తీసేస్తామని యాజమాన్యం హెచ్చరించడంతో ఉద్యోగులు భయపడుతున్నారని తెలిసింది. అక్కడ పనిచేస్తున్నవారిలో ఎక్కువమంది తెలంగాణకు చెందినవారేనని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: Mamya Shajaffar: ట్రెడిషనల్ లుక్‌లో మమ్యా షజాఫర్.. ఎల్లో డ్రెస్‌లో లక్ష్మీదేవిలా కనిపిస్తుందిగా!

Also Read: Jio Cheapest Recharge Plan: ఇదేంది మావా ప్లాన్ అదిరింది.. జియో చీపెస్ట్ రీఛార్జ్ ధర- 90 రోజులు ఫ్రీ హాట్‌స్టార్

telangana | nizamabad | nirmal | pakisthan | dubai | murder | telangana-news | international-news | international news in telugu | international news telugu | latest-international-news | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు