Kamareddy Rains: కామారెడ్డి మునిగిపోవడానికి అసలు కారణం ఇదే!
కామారెడ్డి జిల్లాలో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల పలు ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. అక్కడ ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. GRకాలనీ, అశోక్ నగర్, కాకతీయ, గోసంగి, ఇందిరానగర్ కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి
BJPలో గొడవలపై MP అర్వింద్ సంచలన కామెంట్స్
బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంపై నిజామాబాద్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాజీ, కొత్త అధ్యక్షులు కలిసి ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలు పరిష్కరించాలని ఆయన కోరారు.
Liquor Ban: మద్యం తాగితే లక్ష జరిమానా, ఏడు చెప్పు దెబ్బలు
మద్యపాన నిషేధంలో భాగంగా కొన్ని గ్రామాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుని మిగితా గ్రామలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని తండా గ్రామస్తులు ఇటీవల మద్యపానం నిషేధించారు.
Telangana Crime: తెలంగాణలో ఘోరం.. తండ్రిని రోకలిదుడ్డుతో కొట్టికొట్టి చంపిన కూతురు.. తల్లే కారణం..!
నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం గ్రామంలో దారుణం జరిగింది. తండ్రి నర్సయ్య (54) చెడు వ్యసనాలకు బానిసై తరచూ తల్లి నర్సమ్మతో గొడవ పడుతున్నాడని కూతురు అతడ్ని కొట్టి చంపింది. ఆపై పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం వివరించింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
TG Crime : అమెరికాలో కామారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్న తెలుగు యువతీ, యువకులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు.
TG Crime : అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కోసం.. కన్న కొడుకుని అమ్మేసింది!
సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకును రూ. 50 వేలకు అమ్మేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. అయితే ఆ బాలుడిని కొన్న మహిళ రూ. లక్షకు మరో వ్యక్తికి అమ్మేసింది. దీంతో పోలీసులకు విషయం తెలియడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.