/rtv/media/media_files/2025/04/15/1JznLCt9FeoFZHCt4LPH.jpg)
TTD
తిరుమల లడ్డూకి ఉన్న ప్రత్యేకతలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేవుడిని దర్శించుకోవడానికి వెళ్లిన వారు కొందరైతే.. కేవలం లడ్డూ కోసం వెళ్లే వారు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ తయారు చేసే లడ్డూ ఇంత టేస్టీగా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లభించదు. స్వామి వారి లడ్డూకి ఎన్నో సంవత్సరాల ప్రత్యేకత ఉంది. ఎంతో పవిత్రంగా ఈ లడ్డూను తయారు చేస్తారు.
ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..
Purity in Every Bite:
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) April 15, 2025
Here’s how premium Kaju (cashew nuts) are carefully processed for use in the sacred Srivari Laddu Prasadam.
A blend of quality, devotion & tradition in every Laddu!#TTD #SrivariLaddu #KajuProcessing #Tirumala #TTDReforms #tirumalaladdu pic.twitter.com/s6sjwNAJzR
ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
నియమ, నిబంధనలు పాటిస్తూ..
ఇంతటి పవిత్రమైన లడ్డూలో కల్తీ జరిగిందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తిరుమల ప్రసాదంలో తయారు చేసే లడ్డూను కల్తీ నెయ్యిని ఉపయోగించారని, అందుకే టేస్ట్ తగ్గిపోయిందని జోరుగా ప్రచారం సాగింది. దీనిపై పూర్తి విచారణ కూడా చేపట్టారు. అయితే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో టీటీడీ దేవస్థానం నియమ, నిబంధనలు పాటించడంతో పాటు శుభ్రత పాటిస్తారు.
ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?
లడ్డూ తయారీలో ఉపయోగించే జీడిపప్పును శుభ్రం చేసి ఎలా వినియోగిస్తున్నారో టీటీడీ దేవస్థానం ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఓ శుభ్రమైన హాల్‌లో జీడిపప్పును వేసి చిన్న చాకుతో వాటిని కట్ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ కూడా చేతులకు గ్లౌజ్ ధరించి, తల వెంట్రుకలు పడకుండా పెట్టుకున్నారు. అలాగే నోటి తుంపరలు పడకుండా ఉండేందుకు మాస్క్ కూడా ధరించారు. ఇలా అన్ని విధాలుగా కూడా జాగ్రత్త వహించి జీడిపప్పును కట్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!