Iran: వాట్సాప్‌ను డిలీట్ చేయండి.. ఇరాన్ సంచలన ప్రకటన
తమ దేశంలో ఉండే ప్రజలు వెంటనే స్మార్ట్ఫోన్ల నుంచి వాట్సాప్‌ను తొలిగించాలని ఇరాన్ సూచనలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్‌కు పంపిస్తోందని తెలిపింది.
తమ దేశంలో ఉండే ప్రజలు వెంటనే స్మార్ట్ఫోన్ల నుంచి వాట్సాప్‌ను తొలిగించాలని ఇరాన్ సూచనలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్‌కు పంపిస్తోందని తెలిపింది.
సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. పశ్చిమాసియా, యూరప్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యుద్ధాలు చేసుకొనే యుగం కాదని మేము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.
లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఆర్మీ విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా దాని టైర్లో ఒకటి మంటల్లో చిక్కుకుంది.దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని తన మిత్ర దేశాలకు ట్రంప్ సర్కారు షరతు పెట్టిన సంగతి తెలిసిందే.తాజాగా దీని గురించి బీజింగ్ తీవ్రంగా స్పందించింది.తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.
యెమెన్ పై భీకర దాడులు గురించి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన కుటుంబ సభ్యులతో కూడా పంచుకున్నట్లు తెలుస్తుంది.తన భార్య జెన్సిఫర్, సోదరుడు ఫిల్ హెగ్సెత్తో మంత్రి ఈ యుద్ధ ప్రణాళికలను పంచుకున్నట్లు పేర్కొంది.
గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 14 మంది పాలస్తీనా అత్యవసర సేవల సిబ్బందితో పాటు ఓ ఐరాస ఉద్యోగి మృతి చెందారు.ఈ ఘటనలో సైన్యానికి సంబంధించి వృత్తి పరమైన వైఫల్యాలు చోటు చేసుకున్నట్లు తేలింది.ఈ క్రమంలోనే ఓ డిప్యూటీ కమాండర్ పై సైన్యం వేటు వేసింది
ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమరణ పాటిస్తామని ప్రకటించిన రష్యా ఆ మాటకు కట్టుబడి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు.ఈస్టర్ కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లు తప్పుడు వైఖరిని ఆ దేశం ప్రదర్శిస్తోందన్నారు.
విమానం ఆకాశంలో ఉండగా ఓ దుండగుడు హైజాక్ కు యత్నించిన సంఘటన సెంట్ర్ అమెరికాలోని బెలీజ్ లో చోటుచేసుకుంది. కత్తితో బెదిరించి విమానాన్ని తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించగా..మరో ప్రయాణికుడు అడ్డుకుని కాల్పులు జరిపాడు.