Budget 2025: బడ్జెట్లో సామాన్యులకు ఊరట.. ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా ?
కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఢిల్లీ ప్రజలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా వంటి ప్రకటనలు అక్కడి ఓటర్లను ఆకట్టుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.