ఇద్దరు కన్న బిడ్డలను.. వేట కొడవలితో.. ఇంట్లోనే నరికి చంపిన తల్లి.. ఆ తర్వాత అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన కలకలం రేపింది. ఆ కన్నతల్లి ఇంత ఘోరానికి ఎందుకు పాల్పడింది అనే ప్రశ్న ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్నగా మిగిలిపోయింది.
Also Read: Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!
సూసైడ్ నోట్‌లోని వివరాలు.. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి హైస్కూల్ రోడ్డు ప్రాంతానికి చెందిన గండ్ర వెంకటేశ్వర్ రెడ్డి, తేజస్విని రెడ్డి (35) భార్యాభర్తలు. వీరికి ఆశిష్ రెడ్డి(8), హర్షిత్ రెడ్డి(6) సంతానం. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక తేజస్వినిని, వెంకటేశ్వర్ రెండో వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం ఈ దంపతులు హైదరాబాద్‌కొచ్చారు. గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్‌లో ఉన్న సహస్ర మహేశ్ హైట్స్ అపార్టుమెంట్‌లో రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్వర్ బొంతపల్లి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్‌లో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య తేజస్విని ఇంటివద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటటోంది.
Also Read:JEE Key-Results Update: జేఈఈ మెయిన్ కీ తొలగించిన ఎన్టీఏ.. ఫలితాల విడుదలపై గందరగోళం!
ఆశిష్, హర్షిత్ గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లోని న్యూ ఎరా ది లీడ్‌స్కూల్‌లో రెండో తరగతి, ఒకటో తరగతి చదువుతున్నారు. తేజస్విని కొన్నాళ్లుగా కంటి సమస్యతో బాధపడుతోంది. పెద్ద కుమారుడు ఆశిష్ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఏంతిన్నా వాంతులు చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడైన హర్షిత్‌కు కూడా అప్పుడప్పుడు ఇదే సమస్య వస్తోంది. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పెద్ద కుమారిడికి ఆమె చికిత్స చేయిస్తోంది. పిల్లల స్వస్థత కోసం గూగుల్‌లోనూ వెతుకుతూ మందులు వాడుతోంది.
తనతోపాటు పిల్లలు కూడా తరచూ అనారోగ్యానికి గురవుతుండటాన్ని జీర్ణించుకోలేక ఆమె మానసిక పరిస్థితి చాలా దారుణంగా మారింది. గురువారం సాయంత్రం నాలుగింటికి 6పేజీల సూసైడ్ నోట్ రాసింది. ఇంట్లోనే ఆడుకుంటున్న ఆశిష్, హర్షిత్‌ను పట్టుకొని.. అప్పటికే బయట నుంచి తెచ్చుకున్న వేటకొడవలితో మెడ, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఇద్దరు పిల్లలూ గాయాలతో నెత్తురోడుతున్న స్థితిలోనూ ప్రాణభయంతో వంటింట్లోకి.. పడక గదిలోకి పరుగులు తీసినా వెంబడించి పట్టుకొని వేటు మీద వేటు వేసింది. ఈ ఘటనలో ఆశిష్ అక్కడికక్కడే మృతిచెందాడు.
తీవ్ర గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హర్షిత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ లోపే.. తేజస్విని, అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రగాయాలుకావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కాగా ఇంట్లోంచి తేజస్విని సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. పిల్లలు, తాను అనారోగ్యంతో బాధపడుతున్నా.. భర్త కనీసం పట్టించుకోవడం లేదని, తమ సమస్యలు చెబితే ముగ్గురు చచ్చిపోండని కోప్పడటంతోనే తాము చచ్చిపోతున్నామని నోట్‌లో తేజస్విని రాసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
hyderabad | telangana | crime | mother | murder | childern | suicide | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates