/rtv/media/media_files/2025/04/18/0G4GGgsNow7Q9r20z1EJ.jpg)
trump melony
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని, వ్యక్తిగతంగానూ ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందని వెల్లడించారు. మెలోనిలో చాలా ప్రతిభ ఉంది, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఆమె ఒకరంటూ అతడు కొనియాడారు.
Also Read: Hijack: విమానం హైజాక్ కి ప్రయత్నం..ప్రయాణికులు కాల్పులు జరపడంతో..!
ఇక, టారిఫ్స్ పెంపుపై అమెరికా వైఖరిని జార్జియా మెలోనీ వ్యతిరేకించినా.. యూరోపియన్ దేశాల నుంచి డొనాల్డ్ ట్రంప్ ని కలిసిన తొలి ప్రధాన మంత్రి ఆవిడే. కాగా, గురువారం నాడు వైట్ హౌస్‌లో ఇటాలి ప్రధాని జార్జియా మెలోనితో ట్రంప్ సమావేశం అయినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్‌తో 100 శాతం వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. వాణిజ్య సుంకాలపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ట్రంప్ ఈ సాహసోపేతమైన ప్రకటనను విడుదల చేశారు.
US Trade Deal With Europe
దీంతో ఆయన మొదట ఈయూ దిగుమతులపై విధించిన 20 శాతం సుంకం.. 90 రోజుల పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అలాగే, ఇతర దేశాలతో బహుళ వాణిజ్య ఒప్పందాలు త్వరలో జరగవచ్చని సూచించారు. ప్రతి ఒక దేశంతో ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నామని ట్రంప్ వెల్లడించారు.
అయితే సుంకాలపై ట్రంప్-మెలోనీ మధ్య కీలక చర్చలు జరిగాయి. అయితే సుంకాలపై సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఓవల్ ఆఫీసులో ట్రంప్-మెలోనీ పేర్కొన్నారు. ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. డీల్ విషయంలో తొందరపడడం లేదని తెలిపారు. ఇక పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని.. అందుకోసం కలిసి పని చేస్తామని మెలోనీ చెప్పుకొచ్చారు.
యూరోపియన్ యూనియన్‌తో సుంకాల ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలను డోనాల్డ్ ట్రంప్-జార్జియా మెలోని చర్చించారని వైట్‌హౌస్ పేర్కొంది. ఇరుదేశాల మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు వెల్లడించింది. సుంకాలు తగ్గించేందుకు యూరోపియన్ దేశం ముందుకొచ్చింది. ఇక ఇద్దరి మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. ఇద్దరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడటం కనిపించింది. ఈ సందర్భంగా మెలోనీ తీరును ట్రంప్ ప్రశంసించారు. అద్భుతం అంటూ ఆమెను ట్రంప్ కొనియాడారు.
Also Read: Canada: మా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ అత్యంత ప్రమాదకారి..కెనడా ప్రధాని మార్క్
Also Read: America-Gunturu: టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!
telugu-news | italy | italy-pm | meloni | latest-telugu-news | latest telugu news updates | trump tariffs | donald trump tariffs | today-news-in-telugu | international news in telugu