/rtv/media/media_files/2025/04/18/EV86Z82Xtty27JMLYRGf.jpg)
World Photo Of The Year
గాజా మారణకాండకు గుర్తుగా...అక్కడ జరిగిన దాడిలో రెండు చేతులూ కోల్పోయిన పిల్లాడి ఫోటోపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ ఫోటో వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్ 2025గా ఎంపిక అయింది. ఇందులో ఉన్న బాలుడి పేరు మహ్మద్ అజ్జౌర్. అతని వయసు తొమ్మిదేళ్లు. ఇజ్రాయెల్, హమాస్ ల ధ్య యుద్ధం ఈ చిన్నారి బాల్యాన్ని చిదిమేసింది. హాయిగా ఆడుతూ పాడుతూ ఉండాల్సి జీవితాన్ని దు:ఖమయం చేసింది.
చిత్ర చెప్పే కథ..యుద్ధ దారుణం
ఇదొక బాలుడి కథను చెప్పే చిత్రమని ఫోటో తీసిన మహిళా ఫోటోగ్రాఫర్ సమర్ అబు ఎలౌఫ్ అంటున్నారు. ఖతార్ లో పని చేస్తున్న ఈమె ది న్యూయార్క్ టైమ్స్ కోసం ఈ ఫొటో తీశానని చెప్పారు. 68వ వేడుకగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక ఫొటో జర్నలిజం పోటీల్లో 141 దేశాలకు చెందిన 3,778 మంది ఫొటోగ్రాఫర్లు మొత్తం 59,320 ఎంట్రీలను సమర్పించారు. అందులో ఈ బాలుడి ఫోటో మొదటి బహుమతిని గెలుచుకున్నట్టు వరల్డ్ ప్రెస్ ఫొటో ఆర్గనైజేషను ఓ ప్రకటనలో తెలిపింది.
తాను తీసిన ఫోటో తరతరాలపై ప్రభావం చూపే సుదీర్ఘమైన యుద్ధం గురించి చెబుతుందని వరల్డ్ ప్రెస్ ఫొటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు జౌమానా ఎల్‌జీన్ ఖౌరీ వ్యాఖ్యానించారు. గాజా యుద్ధ ఇలా ఎన్నో బాల్యాలను చిదిమేసిందని ఫటో గ్రాఫర్ సమర్ చెప్పారు. ఫోటో తీసినప్పుడు తాను పిల్లాడి అమ్మతో మాట్లాడానని..ఆమె బాలుడి గురించి తనకు చెప్పిందని అన్నారు. తన చేతులు రెండూ ఇకలేవని తెలియగానే.. ‘అమ్మా! ఇకపై నేను నిన్నెలా హత్తుకోనూ? అని అడిగాడని...ఆ తల్లి ఆవేదనకు గురైయ్యారని సమర్ తెలిపారు.
ఇక ప్రస్తుతం గాజా చాలా దురుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. అక్కడ ఆహార సంక్షోభం విపరీతంగా ఉంది. ఆకలికి తాళలేక పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. హమాస్ ను బయటకు రప్పించేందుకు ఇజ్రాయెల్ మానవతా సహాయాన్ని నిలిపివేసింది. గాజాలకు వనరులు చేరకుండా ఐడీఎఫ్ అడ్డుకుంటోంది. దీంతో గాజాలో ఎవరికీ సరైన తిండి దొరకడం లేదు. ఇదే కంటిన్యూ అయితే అక్కడ వేలమంది మరణిస్తారని...ఇప్పటికే చాలా మంచి చనిపోయారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.
today-latest-news-in-telugu | gaza | World Press Photo of the Year | boy
Also Read: Unesco: భగవద్గీత, నాట్యశాస్త్రాలకు అరుదైన గౌరవం.. యునెస్కో గుర్తింపు
Follow Us