Madhya Pradesh: భర్తను 36 సార్లు కత్తితో పొడిచి..ప్రియుడికి వీడియో కాల్ లో చూపించిన మైనర్‌ భార్య!

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఓ మైనర్‌ భార్య తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. మృతుడు గోల్డెన్‌ పాండే కు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. హత్య తరువాత ప్రియుడికి వీడియో కాల్‌ చేసిన భార్య పని పూర్తయ్యిందని చెప్పింది.

New Update
mp

mp

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఓ మైనర్‌ భార్య (17) తన భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసి పారిపోయింది. మృతుడు గోల్డెన్‌ పాండే అలియాస్‌ రాహుల్‌ (25) గా పోలీసులు గుర్తించారు. వీరికి నాలుగు నెలల క్రితమే వివాహం జరిగినట్లు సమాచారం. పాండే మృతదేహం ఆదివారం కనిపించింది. ఆయన భార్య కనిపించకపోవడంతో పోలీసులు ఆమె ప్రమేయం గురించి అనుమానించారు.

Also Read: NIA: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు లష్కరే తొయిబా కుట్ర!

మైనర్‌ భార్యతోపాటు ఆమె ప్రియుడు యువరాజు, అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు నేరాన్ని అంగీకరించారు. షాపింగ్‌కు వెళ్లిన దంపతులు మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్‌ వద్ద టిఫిన్‌ చేశారు. అనంతరం ఇరువురు బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో తన చెప్పు కింద పడిపోయిందని మైనర్‌ భార్య తన భర్తతో చెప్పింది.

Also Read: FlipKart: వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే...ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ సంచలన నిర్ణయం!

దీంతో పాండే బైక్‌ను ఆపాడు. వెంటనే ఆమె స్నేహితులిద్దరితో కలిసి, పాండేను పగిలిన బీరు సీసాతో 36 సార్లు పొడిచారు. పాండే అక్కడికక్కడే మరణించాడు. అనంతరం మృతదేహాన్ని యువరాజుకు వీడియోకాల్‌లో చూపించారు. మృతదేహాన్ని పొలాల్లో విసిరేసి, పారిపోయారు.

పని పూర్తయింది...

హత్య తర్వాత, భార్య తన ప్రియుడికి వీడియో కాల్ చేసి, రాహుల్ మృతదేహాన్ని చూపించి, "పని పూర్తయింది" అని చెప్పింది. ఆ తర్వాత ఆ బృందం రైలులో ఇండోర్‌కు పారిపోయి, తరువాత ఉజ్జయిని వైపు వెళ్ళింది.మొబైల్ లొకేషన్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను ఉపయోగించి పోలీసులు నిందితులను ట్రాక్ చేశారు. నలుగురినీ ఇండోర్‌లోని సాన్వర్ లో అరెస్టు చేశారు.

పోలీసుల దర్యాప్తులో మృతుని భార్య, యువరాజ్ వివాహానికి ముందే సంబంధంలో ఉన్నారని తేలింది. రాహుల్‌ను వివాహం చేసుకున్న తర్వాత కూడా వారు సంబంధం కొనసాగిస్తున్నారు. ప్లాన్‌ ప్రకారమే పాండేను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.సీఎస్పీ గౌరవ్ పాటిల్ మరియు శికార్పురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కమల్ సింగ్ పవార్ నేతృత్వంలోని పోలీసు బృందం నిందితులను త్వరగా అరెస్టు చేసింది. విచారణలో నలుగురూ హత్య గురించి నిజాన్ని ఒప్పుకున్నారు.

Also Read:Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!

Also Read: America-Gunturu:టెక్సాస్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!

madhyapradesh | crime | lover | wife | husband | murder | latest-news | telugu-news

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు