/rtv/media/media_files/2025/05/23/pxwhddXLXWjMGbxxRRLn.jpg)
మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే ఆరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా ఎంపీ డీకే అరుణను నియమించింది. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ పదవి ద్వారా డీకే ఆరుణ రాష్ట్రంలోని ఏ గోడౌన్ లోనైనా ఆమె తనిఖీలు చేయవచ్చు. ఆహార ధాన్యాల నాణ్యతను పరిశీలించి అవసరం అయితే ఆమె చర్యలు తీసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కమిటీ ద్వారా తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడంలో, పరిష్కార మార్గాలు చూపడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాటిస్తున్నాను అని ఆమె ట్వీట్ చేశారు.
Also Read : బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు హార్ట్‌ఎటాక్
Also Read : కుంకుమపువ్వు టీ తాగితే ఎన్ని ప్రయోజనాలంటే?
Central Government Gave Responsibilities To MP DK Aruna
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్ గా నన్ను ఎంపిక చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
— D K Aruna (@Aruna_DK) May 23, 2025
ఈ కమిటీ ద్వారా తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడంలో, పరిష్కార మార్గాలు చూపడంలో… pic.twitter.com/Z6Hiwtzt6X
Also Read : కవిత లేఖ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీనా?
Also Read : ఎంతకు తెగించార్రా.. 12 ఏళ్ల దళిత బాలికపై ఐదుగురు మైనర్లు అత్యాచారం !
bjp | telangana | dk-aruna | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | breaking news in telugu | telangana news live updates | telangana-news-updates | telangana news today