ఈరోజు నీది రేపు అల్లు అర్జున్‌ది | DK Aruna Comments On Allu Arjun Issue | CM Revanth Reddy | RTV
తెలంగాణలో బీజేపీకి కొత్త రథసారథి నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే అధ్యక్ష పీఠం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్, డీకే అరుణ మధ్య పోటీ ఉండగా ఈటలవైపు మొగ్గు చూపుతున్నట్లు చర్చ నడుస్తోంది.
మొయినాబాద్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లకు భూనిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఈటల రాజేందర్, డీకే అరుణ, మహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలో తనకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే రేవంత్ రెడ్డి లగచర్లలో కుట్ర చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. రైతులపై పెట్టిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని, జైళ్లలో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లగచర్ల గ్రామంలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ డీకే అరుణ లగచర్ల పర్యటనలో తీవ్ర ఉద్రిక్రత చోటుచేసుకుంది. ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఎంపీనే అడ్డుకుంటారా? అంటూ పోలీసులపై అరుణ ఫైర్ అయ్యారు.
తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడంతో కేంద్రమంత్రి పదవి కోసం పలువురు నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను కేంద్రమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం లేదని.. అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు.
సీఎం రేవంత్ కు బిగ్ షాక్ తగిలింది. సొంత జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపంచుకోలేకపోయారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారు. 6 6వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.