/rtv/media/media_files/2025/05/23/I0GkLcpuhVdw1cXpSavC.jpeg)
తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖ ప్రకంపనలు లేపింది. బీఆర్ఎస్‌లో చీలిక, కేసీఆర్ ఫ్యామిలీ నుంచే కవిత కొత్త పార్టీ పెడుతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఆరు పేజీల లేఖపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం హాట్ కామెంట్స్ చేశారు. కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీనా గురించా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆమె చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతుందని మెదక్ ఎంపీ రఘనందర్ రావు అన్నారు. ప్లీనరీతో కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు వచ్చింది నిజమేనని ఆయన జోస్యం చెప్పారు.
Also Read : బీర్లు కొంటలేరు.. తెలంగాణలో భారీగా తగ్గిన అమ్మకాలు.. ఎందుకంటే!
Also Read : భారత్ నుంచి కీలక కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న బంగ్లాదేశ్
MP Raghunandan Rao React Kavitha's Letter
కవితను బయటకు పంపేందుకు హరీష్, కేటీఆర్ మీటింగ్ అయ్యారేమో అని రఘునందన్ రావు అన్నారు. కవిత మరో షర్మిల కాబోతున్నట్లు కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్ పార్టీకి చెందిన పేపర్, టీవీల్లో వార్తలొచ్చాయి. కవిత కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశాలున్నాయని రఘునందన్ రావు చెప్పారు. ఈ డ్రామా వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. లెటర్ బయటపెట్టింది కేసీఆరా?.. కవితనా? అని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కవిత లేఖతో బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతుందని ఆమె అన్నారు.
Also Read : అదంతా డ్రామా.. కవిత లేఖపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
అటు కవిత లేఖపై కాంగ్రెస్, బీజేపీ అనేక ఆరోపణలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. అలాగే లేఖను ఇప్పటివరకూ కవిత ధృవీకరించలేదు, ఖండించలేదు. దీంతో కవితకు, కేసీఆర్‌కు గ్యాప్ నిజమేనంటూ ప్రచారం అవుతుంది. ఆలె నరేంద్ర, ఈటల తరహాలోనే కవితపై వేటు తప్పదా అనే సందేహాలు సొంత పార్టీ కార్యకర్తల్లోనే తలెత్తుతున్నాయి.
Also Read : పంజాబ్ కింగ్స్ టీమ్‌లో వివాదం.. ఆ ముగ్గురిపై కోర్టుకెక్కిన ప్రీతి జింటా!
kavitha latter to KCR | bjp mp raghunandan | bjp mla raghunandan rao | brs | kcr | telangana | brs mlc kavitha | latest-telugu-news