/rtv/media/media_files/2025/05/23/hphFO6s89ndZcWMZ3hm3.jpg)
gang-rape up
12 ఏళ్ల దళిత బాలికపై ఐదుగురు మైనర్లు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో చోటుచేసుకుంది. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపిన దుండగులు బాధితురాలు సృహ కోల్పోయాక ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మే 8న జరిగిన ఈ ఘోరాన్ని నిందితులు ఫోన్ లో రికార్డు చేసి ఎవరికైనా చెబితే దీనిని సోషల్ మీడియాలో పెడతామని, చంపేస్తామని బెదిరించారు. బాధితురాలి తల్లికి విషయం తెలియడంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు కూడా దళితులు కాగా అందరూ 12 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే. నగరంలోని ఒక పాఠశాలలో బాలికతో పాటు 7 నుంచి 9 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
Also Read : ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు
Also Read : గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్.. బయటకు వచ్చాక రోడ్లపై హల్ చల్
బాలిక ఆడుకుంటుండగా
తన ఇంటి సమీపంలో బాలిక ఆడుకుంటుండగా ఆమెతో మాటలు కలిపిన ఐదుగురు నిందితులు ఏదో కొనిస్తామని చెప్పి ఆమెను తమ వెంట హైస్కూల్‌కు తీసుకువెళ్లారు. అయితే వారిలో ఒకరి తండ్రి స్కూల్లో వాచ్‌మన్ కావడంతో బడి తాళం చెవులు తెచ్చాడు. బడి గేటు తాళం తీసి.. ఆమెను నేరుగా ప్రిన్సిపల్ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ను బాలికతో తాగించారు. ఆమె మత్తులోకి జారుకోగానే ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటన జరిగిన వెంటనే ఆ బాలిక భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఈ ఘటనపై ఎస్ఎస్పీ సత్పాల్ అంటిల్ మాట్లాడుతూ, "కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశాం. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.
Also Read : కవిత లేఖ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీనా?
Alsoi Read : కసాయి తల్లి.. నవ శిశువుని బావిలో పడేసి.. తర్వాత ఏం చేసిందంటే?
crime | minor-girl | Uttar Pradesh